దహి సేవ్ పూరి

 

 

కావలసినవి :

మైదా - 1 కప్

సన్న కారపూస - పావు కప్పు

ఉల్లిపాయ - 1

చింతపండు రసం - పావు  కప్పు

పెరుగు - పావు  కప్పు

కొత్తిమీర - కట్ట 1

ఉప్పు  1 స్పూన్

నూనె  తగినంత

పంచదార  1 స్పూన్

 

తయారీ :

ముందుగా మైదాలో కొంచెం నీళ్ళు పోసుకుని పూరిపిండిలా కలపాలి తరువాత పిండిని ఉండలుగా చేసుకుని పూరిలా వత్తుకుని చిన్న మూత తో రౌండ్ గా చిన్న పూరిలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి వేడి చేసి తయారు చేసుకున్న పూరీలను వేయించుకోవాలి   చింతపండురసం కొత్తిమీర, ఉప్పు, పంచదార మిక్సిలో వేసి గ్రీన్ చట్ని చెయ్యాలి. పెరుగు గిలక్కొట్టి కొంచెం ఉప్పు పంచదార కలపాలి. తరువాత  ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి.  ఇప్పుడు పూరి తీసుకుని ఒకవేపు  నొక్కి దానిలో గ్రీన్ చట్ని కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు ,స్పూన్ పెరుగు  పైన కారపూస వేసి సర్వ్ చేసుకోవాలి.