కోకోనట్ ఎనర్జీ బాల్స్

 

 

కావలసిన పదార్థాలు:

పచ్చికొబ్బరి తురుము - అరకప్పు
ఖర్జూరాలు  - పది
బాదంపప్పు - అరకప్పు
పొడి చేసిన బెల్లం - పది చెంచాలు
దాల్చినచెక్క పొడి - చిటికెడు

 

తయారీ విధానం:

ఖర్జూరాల్లో గింజలు తీసేసి, వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. బాదంపప్పు తొక్క ఒలిచేసి... సన్నగా తరుమాలి. ఓ గిన్నెలో బెల్లం వేసి స్టౌ మీద పెట్టాలి. బెల్లం కరిగిన తరువాత కొబ్బరి వేసి బాగా కలియబెట్టాలి. పాకంలాగా అవుతున్నప్పుడు ఖర్జూరాల పేస్ట్ ను కూడా వేసి బాగా కలపాలి. మిశ్రమం అంతా దగ్గరగా అయినప్పుడు తురిమిన బాదం పప్పుల్ని కూడా వేసి కలిపి దించేయాలి. మిశ్రమం మరీ చల్లారకముందే లడ్డూల్లా చేసుకోవాలి. వీటికి కాస్త పచ్చి కొబ్బరిని అద్ది తింటే రుచికి రుచి, బలానికి బలం!

- Sameera