చాక్లెట్ ఐస్‌క్రీమ్

 

 

 

 

కావలసిన పదార్థాలు :

* హోల్‌మిల్క్ - 500 ఎం.ఎల్

* క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది) - 230 గ్రా.

* పంచదార - 150 గ్రా.

* చాక్లెట్ ఫ్లేవర్ పదార్థాలు (చాక్లెట్ బోర్న్‌విటా లేదా బూస్ట్, లేదా హార్లిక్స్) - 250 గ్రా.

* స్కిమ్డ్ మిల్క్ పౌడర్ - 50 గ్రా.

 

తయారుచేయు పద్దతి:

మిల్క్ బాయిలర్ (పాల కుకర్)లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి. మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి.


ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి. ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా, రుచిగా ఉంటుంది. పాల మిశ్రమం చల్లారక చాక్లెట్ పదార్థాలు వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు ఉంచి, తర్వాత సర్వ్ చేసుకోవాలి.