పాలకూర-శనగల కూర

 

 

 

కావసిన పదార్థాలు :

కాబూలీ శనగలు - పావుకిలో

పాలకూర - ఒక కట్ట

ఉల్లిపాయలు - రెండు

టొమాటోలు - రెండు

పచ్చిమిర్చి - మూడు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా

పసుపు - అరచెంచా

కారం - ఒక చెంచా

గరం మసాలా పొడి - అరచెంచా

జీలకర్ర పొడి - అరచెంచా

యాలకులు - రెండు

మిరియాలు - నాలుగు

నూనె - రెండు చెంచాలు

 

తయారీ విధానం :

శనగల్నిరెండు మూడు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. ఉదయం కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి.

పాలకూరను శుభ్రంగా కడిగి ఉడికించాలి. తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.

టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక యాలకులు, మిరియాలు వేయాలి. 

ఓ నిమిషం తరువాత టొమాటోలు కూడా వేసి ముక్క మెత్తబడేవరకూ వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకూ వేయించాలి.

ఆపైన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేయాలి. ఓ నిమిషం పాటు వేయించాక శనగలు వేయాలి. మసాలా అంతా శనగలు బాగా పట్టేలా కలుపుతూ కాసేపు వేయించాలి.

శనగలు కాస్త రంగు మారిన తరువాత పాలకూర పేస్ట్ వేయాలి. పేస్ట్ మరీ గట్టిగా ఉంటే కాస్త నీళ్లు పోసి మూత పెట్టాలి. కూర బాగా ఉడికి దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. ఇది రోటీల్లోకి చాలా బాగుంటుంది.

 

 

- Sameera