బూంది లడ్డూ 

 

 

కావలసిన పదార్థాలు:

శనగపిండి - 250 గ్రాములు 

పంచదార - 500 గ్రాములు 

నూనె - 1 కేజీ 

యాలకుల పొడి - 1/2 స్పూన్ 

జీడిపప్పు - 20 గ్రాములు 

కిస్‌మిస్ - 20 గ్రాములు 

బూంది గరిట  

 

తయారుచేసే  విధానం:

శనగపిండిని నీళ్ళతో  కొంచం  పలచగా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ మీద  మూకుడు పెట్టి నూనె పొయ్యాలి. నూనె మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. శనగపిండిని బూంది గరిటలోకి తీసుకుని  కాగుతున్న నూనెలో బూంది కొట్టాలి. అప్పుడు మూకుడులో  చిన్న చిన్న బూంది లాగా వస్తుంది. బూందీ కొంచెం పచ్చిగా  ఉండగానే మూకుడులోంచి తీసేయాలి. ఇలాగే  మొత్తం పిండిని బూందిలా తయారుచేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మూకుడులో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ని వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో  పంచదార  వేసి ఒక గ్లాస్ నీళ్ళు  పోసి స్టవ్ మీద పెట్టి  పాకం పట్టాలి . పాకం లేతగా తీగ పాకం రావాలి. తయారు చేసిన బూందిని పాకంలో వెయ్యాలి. జీడిపప్పు, కిస్‌మిస్, యాలుకులపొడి, పచ్చకర్పూరం కూడా  వేసి బాగా కలిపి ఉండలు చెయ్యాలి .

 

అంతే రుచికరమైన బూంది లడ్డు  మీ చేతిలో...

 

-సంధ్య కోయ