బేబీ కార్న్ బజ్జీలు

 

 

 

 

కావలసినవి
బేబీకార్న్‌ - పది
శనగపిండి-అరకప్పు
బియ్యప్పిండి-రెండు టీ స్పూన్లు,
వంటసోడా - చిటికెడు
అల్లంముక్క-చిన్నది
వెల్లుల్లి రెబ్బలు-రెండు
కొత్తిమీర-కొంచెం
పసుపు-చిటికెడు
ఉప్పు-తగినంత
నూనె- సరిపడినంత
పచ్చిమిరపకాయలు-రెండు

 

తయారుచేసే విధానం
ముందుగా శనగపిండిలో బియ్యప్పిండిని కలపాలి. తరువాత ఉప్పు, వంటసోడా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ,కొత్తిమీర కలిపి చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలాగ కలుపుకోవాలి. బేబీకార్న్‌ మూడు ముక్కలు కోయాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని నూనె పోసి కాగాక  ముక్కల్ని పిండిలో  ముంచి తీసి నూనెలో వేసి ఎర్రగా వేయించాలి. ఈ బేబీ కార్న్‌ బజ్జీలను టమాటాసాస్‌ తో సర్వ్ చేసుకోవాలి