అవధి పనీర్

 

 

కావలసినవి:-

పనీర్ - అర కిలో

టమాటాలు - 4

అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక స్పూను

వెన్న - ఒక కప్పు 

క్రీమ్ - రెండు స్పూన్లు

మెంతికూరపొడి - ఒక స్పూను 

గరంమసాలా - ఒక స్పూను 

తేనె - రెండు స్పూన్లు 

పచ్చిమిర్చి - నాలుగు 

జీడిపప్పులు - కొన్ని

కారం, ఉప్పు -తగినంత

 

తయారుచేసే విధానం:-

ముందుగా ఒక గిన్నెలో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి.

 

ఈ ఉడికించిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వడగట్టి జ్యూస్ తీయాలి.

 

తరువాత టమాటా జ్యూస్‌ను వేడి చేసి సగందాకా ఇగిరేలా చెయ్యాలి. అలాగే అందులోనే కారం, జీడిపప్పులు, వెన్న వేసి బాగా కలిపి వేడి చేస్తే గ్రేవీలా తయారు అవుతుంది.

 

ఇప్పుడు పనీర్‌ను ముక్కలుగా కోసి వేయించాలి. ఇప్పుడు పైన తయారు చేసి ఉంచిన గ్రేవీలో ఈ ముక్కలను వేయాలి.

 

ఆ తర్వాత దానిలో తేనె, క్రీమ్, మెంతికూర పొడి కలపాలి. అంతే లక్నో స్పెషల్ అవధి పనీర్ రెడీ.