TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

ఎమ్మెల్యేగా కేసీఆర్ వేతనాలపై రేవంత్ ధ్వజం.!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇన్నేళ్లలో ఆయన అసెంబ్లీకి హాజరైన సందర్భాలు ఒకటి రెండు కంటే ఎక్కువ లేవు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం ఆయన జీత భత్యాలను నిర్మొహమాటంగా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, అసెంబ్లీని గౌరవించడంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్‌ను లక్ష్యం విమర్శలు గుప్పించడానికి ఎంచుకోవడం తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఎమ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టి కూడా నిస్సిగ్గుగా గత రెండేళ్లలో కేసీఆర్ జీతం రూపంలో రూ. 1.24 కోట్లు తీసుకున్నారని రేవంత్ పేర్కొన్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ఎమ్మెల్యేగా కేసీఆర్ జీత భత్యాలు తీసుకుంటున్నారన్న అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హాట్ హాట్ గా వైరల్ అయ్యింది. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు రేవంత్ విమర్శలు, నిలదీత తరువాతైనా కేసీఆర్.. ఫామ్ హౌస్ లో అజ్ణాత వాసానికి చుక్క పెట్టి ప్రజాక్షేత్రంలోకి వస్తారేమో చూడాలి. [Revanth Reddy, KCR Assembly Absence, Telangana Assembly, BRS Leader KCR, Salarie, Telangana Politics, Telugu One]

Published on: Wed Sep 2, 2026 12:08PM

political-news-img

జగన్ లో భయం?.. పులివెందుల జారిపోతోందా?

ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు జగన్ కు పులివెందుల భయం పట్టుకుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికలలో పార్టీ ఓటమి జగన్ రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటను చేస్తారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు. నిజమే.. జగన్ ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలు ఆయనలో భయాన్ని సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన పులివెందుల పర్యటనలు చాలా చాలా అరుదుగానే చేపట్టే వారు. తన తండ్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భాలు కాకుండా ఆయన పులివెందులలో అడుగుపెట్టడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం, పులివెందులలో తన మెజారిటీ గణనీయంగా తగ్గడంతో ఆయన పులివెందుల పర్యటనలు పెరిగాయి. అన్నిటికీ మించి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోయిన తరువాత ఆయనలో పులివెందులపై పట్టు జారిపోతోందన్న భయం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో అప్పటి నుంచి సమయం, సందర్భంతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పులివెందుల వెడుతున్నారు. అక్కడ తన నివాసంలో రెండు మూడు రోజుల ఉంటున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమౌతున్నారు. ప్రజా దర్బార్ తరహాలో వినతులు స్వీకరిస్తున్నారు. నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా ఉండటానికే ఆయన ఇటీవలి కాలంలో తరచూ పులివెందులలో పర్యటిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో వ్యతిరేకత కనిపించడంతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం తగ్గి పెద్దగా పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో జగన్ ముందుజాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. [Pulivendula Fear in Jagan, Jagans Pulivendula visits, YCP Politics, Ap Politics, Telugu One]

Published on: Wed Sep 2, 2026 11:43AM

political-news-img

జనసేనలో బాలినేని పరిస్థితి ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలు నియోజకవర్గం ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. 2024 ఎన్నికల అనంతరం వైసీపీని వీడి జనసేన గూటికి చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ను లక్ష్యంగా చేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో చేసిన విమర్శలు, ఆరోపణలు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య దాదాపు చిచ్చు పెట్టినంత పని చేశాయి. అయితే సకాలంలో తెలుగుదేశం, జనసేన అధినాయకత్వాలు జోక్యం చేసుకుని దామచర్ల, బాలినేనిలను గట్టిగా హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే బాలినేని వ్యాఖ్యలు, విమర్శల పట్ల మాత్రం ఇరు పార్టీలలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వ్యక్తిగత విభేదాలు, పాత తగాదాల లేక్క తేల్చచుకునేందుకు బాలినేని జనసేనను వాడుకుంటున్నారన్న విమర్శలు ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ కూడా వెల్లువెత్తాయి. పరిస్థితిని అర్ధం చేసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో బాలినేనికి స్థానం దక్కలేదు. బాలినేని వంటి సీనియర్ నాయకుడికి స్థానిక ఎన్నికల బాధ్యతల్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని బట్టి జనసేనాని బాలినేనిని దూరం పెట్టారని అవగతమౌతోందంటున్నారు పరిశీలకులు. అలాగే ఒంగోలులో ఎంతో ఘనంగా నిర్వహించిన జనసేన ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజరు కూడా బాలినేనికి జనసేనలో ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోందంటున్నారు. అంతే కాదు.. ఒంగొలులో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజర్ కాలేదనీ, ఆయనను ఆ సమావేశానికి పార్టీ అధిష్ఠానం ఆహ్వానించలేదనీ, అందుకే ఆయన దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో, ఒంగోలులో బాలినేనికి జనసేనలో ప్రాధాన్యత తగ్గిందనీ, పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాలినేని తీరును, పార్టీ కార్యకర్తల, స్థానిక నేతల అభిప్రాయాలనూ, అలాగే మిత్రపక్షమైన తెలుగుదేశం అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. పార్టీలో బాలినేని ప్రభావాన్ని, జోక్యాన్ని తగ్గించారని అంటున్నారు. పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా ఉండాలన్నా, పార్టీ అంతర్గత క్రమశిక్షణ దెబ్బతినకుండా ఉండాలన్నాబాలినేనిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడమే మేలని, జనసేనాని అదే చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూటమి ఐక్యత దెబ్బతినకుండా ఉండటానికీ, అలాగే ప్రకాశం జిల్లాలో జనసైనికులలో కొత్త జోష్ నింపడానికి బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా చర్యలు తీసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Balineni Srinivasa Reddy Imoprtance Diminished, Pawan Kalyan, Janasena Party, Ongole Politics, TDP Janasena Alliance, Telugu One]

Published on: Wed Sep 2, 2026 10:00AM

political-news-img

జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమేనా..?

భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా కొనసాగించడం, రాబోయే రోజుల్లో ఏ విధమైన బిల్లులను ప్రవేశపెడుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖ రాస్తూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, కానీ డీలిమిటేషన్‌ను రాబోయే 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు అంశాలను ముడిపెట్టడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావం చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ నిర్వహించారు. రాజ్యాంగ రీత్యా వ్యూహం రాజకీయ పరిణామాలు ప్రస్తుతం పార్లమెంట్ స్థానాల పెంపునకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటే, అది ఉత్తరాది రాష్ట్రాలకు తీవ్రమైన ప్రయోజనం చేకూరుస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమీకరణాల మార్పు.. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల ద్వారా ఉభయ సభల్లోనూ మెజారిటీ నిరూపించుకునే వ్యూహంతో అడుగులు వేస్తోంది. అయితే, ప్రాంతీయ పార్టీల వైఖరి, ముఖ్యంగా డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ మూడ్ మారడం వంటి పరిణామాలు అధికార పక్షానికి సవాలుగా మారాయి. ప్రతిపక్షాల ప్రతివ్యూహం.. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఒక విభాజక వ్యూహమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తెచ్చి, సీట్ల పెంపు ప్రక్రియను సగానికి సగం విభజించేలా (ఉత్తరాది మరియు దక్షిణాదికి సమంగా) మార్పులు చేయాలని కోరుతోంది. రాజకీయ భయాలు & సంకోచాలు.. రాబోయే ఉత్తర ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై చూపించే ప్రభావం దృష్ట్యా, మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అచితూచి అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీపై వ్యతిరేక స్వారాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా కేంద్రంలో కొత్త భయాలను సృష్టిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ ప్రభావంరాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మారనుంది. జనాభా ఆధారిత విభజన అమలైతే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కబడుతుందనే భావన మరింత బలపడుతుంది. ఇది సమఖ్య వ్యవస్థకే పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది.ఈ రాజకీయ సందిగ్ధత మరింత తీవ్రమైతే, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు డీలిమిటేషన్ ప్రధాన అస్త్రంగా మారుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి ఏకతాటిపైకి వస్తే, కేంద్ర ప్రభుత్వానికి చట్టసభల్లో నిర్ణయాలు తీసుకోవడం సంక్లిష్టంగా మారనుంది. Delimitation Commission, South India Lok Sabha Seats, Women Reservation Bill, Mallikarjun Kharge Letter, Narendra Modi, North vs South Politics, Parliament Seats Expansion, Indian Political Analysis, Delimitation Impact Telugu, Indian Federation Issues, Telugu One, Telugu news

Published on: Tue Sep 1, 2026 8:14PM

political-news-img

కొండా సురేఖ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కథ ఇదేనా.. తెలంగాణ కాంగ్రెస్‌ల్లో హైడ్రామా..!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేస్తున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా హస్తిన మారింది. ప్రధానంగా రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఊహించని ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 2026 సెప్టెంబర్ 1 మంగళవారం నాడు తెలంగాణకు చెందిన కీలక నేతలంతా వరుసపెట్టి ఢిల్లీ బాట పట్టడం వెనుక పలు ఆసక్తికర రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హస్తిన పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనల క్రమంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రంలో మంత్రుల మార్పులు, చేర్పులపై జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ హఠాత్ పర్యటనకు ప్రధాన కారణాల్లో ఒకటి మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన సంచలన వ్యాఖ్యలేనని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లడం, పార్టీ అగ్రనాయకత్వం ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించడంతో సురేఖను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకోవడంతో ఆమె అధిష్ఠానంతో మాట్లాడి పరిస్థితిని వివరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్‌ను కొండా సురేఖ కోరగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కీలక భేటీ ఖరారైనట్లు సమాచారం. ఈ భేటీలో కొండా సురేఖ భవిష్యత్తు మరియు కేబినెట్‌లో ఆమె కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు తెలంగాణ కేబినెట్ విస్తరణ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో మంత్రి పదవుల ఆశావాహులు కూడా ఢిల్లీకి చేరుకుని లాబీయింగ్ తీవ్రతరం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ చేరుకుని, గతంలో తనకు కేబినెట్ పదవి ఇస్తామని ఇచ్చిన హామీని అధిష్ఠానానికి గుర్తుచేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మల్లికార్జున ఖర్గేను కలసి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ లాబీయింగ్ ప్రారంభించడంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవిని ఆశిస్తూ హస్తినకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలోనే ఉండి హైకమాండ్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 1 సాయంత్రం జరగనున్న ఈ వరుస భేటీలు కొండా సురేఖ రాజకీయంపైనే కాకుండా తెలంగాణ మంత్రివర్గంలో రాబోయే కీలక మార్పులపై కూడా పూర్తి స్పష్టత ఇవ్వనున్నాయి. Konda Surekha Delhi Visit, Telangana Cabinet Expansion, Revanth Reddy Congress, Telangana Political News, KC Venugopal Meeting, Telangana Congress Politics

Published on: Tue Sep 1, 2026 7:05PM

political-news-img

ఔను నిజమే.. విజయసాయి రెడ్డిని సజ్జల కొట్టారు.. కన్ ఫర్మ్ చేసిన కోటంరెడ్డి.!

వైసీపీ అంతర్గత వ్యవహారాలు, అగ్రనేతల మధ్య విభేదాలను తెలుగుదేశం నాయకుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కన్ ఫర్మ్ చేశారు. గతంలో వైసిపి ప్లీనరీ సమావేశాల వేదికగా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి మధ్య జరిగిన గొడవలు వాస్తవమేనంటూ సంచలన విషయాలను వెల్లడించారు. అప్పట్లో వైసీపీలో ఉన్న కోటం రెడ్డి నాడు మంగళగిరిలో జరిగిన ప్లీనరీ సందర్భంగా వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. తాజాగా మీడియా సమావేశంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి 2022 లో మంగళగిరి వేదికగా జరిగిన వైసీపీ ప్లీనరీలో జరిగిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు. ప్లీనరీ సమావేశాల విశ్రాంతి గదిలో సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి చొక్కా పట్టుకుని కొట్టారని చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తనకు విజయసాయిరెడ్డిపై ఎలాంటి ప్రేమా లేదంటూ.. అక్కడ నిజంగా ఏంజరిగిందో ప్రజలకు తెలియాలనే ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నానని పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసిన విషయం పార్టీలోని ఎమ్మెల్యేలందరికీ తెలుసన్న ఆయన.. వైసీపీ అధినేత జగన్ కు కూడా ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసన్నారు. అప్పట్లో విజయసాయి, సజ్జల మధ్య నడిచిన ఆధిపత్య పోరుకు సంబంధించి రానున్న రోజులలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇక వైసిపి నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చేస్తున్న ఆరోపణలను ఎద్దేవా చేస్తూ.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కూడా జగన్ మోహన్ రెడ్డే అంటూ ఆ క్రెడిట్ ను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యం లేదని సెటైర్లు వేశారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై మాట్లాడుతూ.. అక్టోబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవు తాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి నిధులు తీసుకురావాలన్నసంకల్పంతో ఉన్నారనీ, వైసీపీయులే.. ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుపడు తున్నారని విమర్శించారు. విశాఖపట్నం తరహాలోనే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల కేసులోనూ కోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. [Kotamreddy Sridhar Reddy confirms vijaya sai allegation, Sajjala Ramakrishna Reddy Beat vijayasai, YCP Plenary Clashes, AP Politics, Telugu One]

Published on: Tue Sep 1, 2026 2:18PM