TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.!

మునిసిపోల్స్ లో పులివెందులలో వైసీపీకి ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే పరిషత్ ఎన్నికలలోనూ ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. పులివెందుల మునిసిపాలిటీని కోల్పోయిన రోజుల వ్యవధిలోనూ వైసీపీ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయింది. . తాజాగా నిర్వహించిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ భారీ ఆధిక్యతతో గెలుచుకుంది. ఈ పరిషత్ పోరులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి భారతి ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై నిలకడగా ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. తుది ఫలితం వెలువడేసరికి ఆమె తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై 1,463 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఫలితం వెలువడగానే కౌంటింగ్ కేంద్రం వెలుపల అలాగే నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కొద్దిరోజుల క్రితమే నిర్వహించిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతంలో లభించిన ఆ అనూహ్య మద్దతు కాకతాళీయం కాదని, గ్రామీణ ప్రాంత పరిధిలోకి వచ్చే ఈ జడ్పీటీసీ ఎన్నికలలోనూ తెలుగుదేశం విజయం, పులివెందులలో వైసీపీ పట్టు కోల్పోయిందనడానికి తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా మున్సిపాలిటీ, పరిషత్ స్థానాల్లో వైసీపీ పరాజయం పాలుకావడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేయడమే కాకుండా, వారిలో నిరాశను, నిస్ఫృహను నింపింది. ఫలితాలు అధికారికంగా వెలువడిన వెంటనే స్థానిక నాయకులు బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయి తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. స్థానిక స్థాయిలో సాధించిన ఈ వరుస విజయాలు రాబోయే రోజుల్లో పులివెందుల రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తాయని తెలుగుదేవం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఎస్కార్ట్ నంటూ నీడలా వెంబడించి: చెవిరెడ్డికి చెమటలు పట్టించి, చుక్కలు చూపించిన సుధారెడ్డి.! వైసీపీకి కంచుకోట అయిన పులివెందులలో చోటుచేసుకున్న ఈ రాజకీయ మార్పు వెనుక స్థానిక ప్రజల నాడిలో వచ్చిన మార్పే కారణమంటున్నారు. వరుస ఓటములతో వైసీపీకి తమ సొంత నియోజకవర్గంలోనే ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందా అన్న అంతర్మథనంలో వైసీపీ ఉంది. రాబోయే రోజుల్లో పులివెందులలో తెలుగుదేశం పార్టీ తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు. నియోజకవర్గవ్యాప్తంగా స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు, వరుస పరాజయాల నుంచి కోలుకుని తిరిగి పుంజుకునేందుకు వైసీపీ ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు: పోటీ నుంచి వైదొలగిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థలు: మైదుకూరు, చిన్నమండెంలో వైసీపీకి బిగ్ షాక్.! పులివెందులలో ఉద్రిక్తత: పార్నపల్లె వద్ద అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.! [Telugudesham Bags Pulivendula ZPTC, Jagan Bastion, Collapse, YCP, Shock, TeluguOne]

Published on: Sat Nov 7, 2026 12:24PM

political-news-img

వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరిద్దరి ప్రయోజనాల కోసం పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించినప్పటికీ, తనను మానసికంగా ఇబ్బంది పెట్టేలా పరిస్థితులు సృష్టించారని ఆయన వాపోయారు. తాను స్వచ్ఛందంగా పార్టీని వీడలేదని, అక్కడి వాతావరణం వల్ల బయటకు వచ్చేలా బలవంతం చేశారని ఆయన స్పష్టం చేశారు. ఏనాడూ లేనివిధంగా పార్టీలో తనను ఇబ్బందులకు గురిచేస్తూ, మానసిక క్షోభ కలిగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు దక్కిన గౌరవం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో కరువైందని ఆయన గుర్తు చేసుకున్నారు. కొందరి తప్పుడు మాటలు నమ్మి తనను దూరం పెట్టారని, ఇది తనను తీవ్రంగా బాధిచించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనూ, అంతర్గత సమావేశాల్లోనూ తనను కించపరిచేలా వ్యవహరించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 70కి పైగా అవమానాలను మౌనంగా భరించానని, ఇక ఆత్మగౌరవాన్ని చంపుకుని అక్కడ కొనసాగలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఎవరికైనా ఆత్మగౌరవం ముఖ్యం అని, దానిని తాకట్టు పెట్టి బతకలేమని ఆయన స్పష్టం చేశారు. కూర్చున్న కొమ్మను నరికేసేలా కొందరు వ్యవహరించిన తీరు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్న పార్టీలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భవిష్యత్తులో నూతన రాజకీయ వేదిక ద్వారా ప్రజల గొంతుకగా మారుతామని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే పాలనను అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. [ Vijay Sai Reddy, Jagan Mohan Reddy, YSRCP, New Political Party Andhra Pradesh, Andhra Pradesh Politics, Sumathi Reddy, Andhra Pradesh politics, New political party AP ]

Published on: Fri Nov 6, 2026 7:34PM

political-news-img

చీరాల మునిసిపోల్ ఫలితాలు: సోదిలో కూడా కనిపించని వైసీపీ.!

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు. తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. మరి కొన్నింటిలో ఆధిక్యంలో ఉంది. చీరాల మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలలో వైసీపీ సోదిలోకి కూడా కనిపించలేదు. అనూహ్యంగా అక్కడ తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. చీరాల మునిసిపాలిటీ ఎన్నికలలో ప్రధానంగా తెలుగుదేశం కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడింది. ఇక్కడ వైపీపీ మూడో స్థానానికే పరిమితమైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శుక్రవారం ప్రారంభించారు. చీరాల మున్సిపాలిటీలో తెలుగుదేశం అభ్యర్థులు ముందంజలో ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. పలు వార్డులలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చింది. అయితే వైసీపీ మాత్రం కనీస పోటీ ఇవ్వలేక చతికిల బడింది. చీరాల మునిసిపాలిటీలో పలు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాలు, స్థానిక సమీకరణాల ప్రభావం ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చీరాలలో ఆమంచి కృష్ణ ప్రసాద్ కు ఉన్న పట్టు కాంగ్రెస్ కు లాభించిందని అంటున్నారు. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఆమంచి కాంగ్రెస్ లో చేరారు. కాగా.. 2024 ఎన్నికల్లోనూ చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి 41,859ఓట్లు దక్కించుకున్నారు. మూడో స్థానంలో నిలిచారు. ఇది కూడా చదవండి: ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.! ఆమంచికి చీరాలలో ఉన్న పట్టు వైసీపీకి మైనస్ గా మారింది. చీరాలలోని ఒక్క వార్డులో కూడా వైసీపీ అభ్యర్థి కనీసం రెండో స్దానానికి చేరుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ విజయం సాధించిన 25వ వార్డులో వైసీపీ బాగా వెనుక బడింది. చీరాల మున్సిపాలిటీలోని మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంటూ తెలుగుదేశం కూటమి ముందంజలో దూసుకుపోతోంది. మున్సిపల్ చైర్మన్ ఓటింగ్‌లోనూ తెలుగుదేశం అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యతలో ఉన్నారు. మొత్తంగా కడపటి సమాచారం అందే సరికి చీరాలలో ఎనిమిది వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే చీరాలలో ఆ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉంది. మీకు నచ్చవచ్చు: [Chirala Municipal Election, Congress, Ahead Ycp, Competition TDP Versus Congress, Andhra Pradesh Politics, Amanchi Krishna Mohan, Effect, Telugu One]

Published on: Fri Nov 6, 2026 3:13PM

political-news-img

స్వోత్కర్ష: పరనింద.. జగన్ కు తెలిసిందిదేనా.?

ఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ అనడంలో సందేహం లేదు. అలాగే గురువారం (నవంబర్ 5) జరిగిన పరిషత్ ఎన్నికలలో కూడా వైసీపీ చేతులెత్తేసినట్లేనని జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరును బట్టి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కింద పడ్డా పై చేయి నాదేనని చాటుకోవడానికి జగన్ పడుతున్న తాపత్రేయం ఆయన ఓటమిని అంగీకరించేశారనడానికి నిదర్శనంగా వారు చూపుతున్నారు. పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. గత రెండేళ్లుగా అంటే 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణ ఓటమి తరువాత నుంచీ ఏం చెబుతున్నారో, తాజాగా స్థానిక సమరంలో ఓటమి తరువాతా అదే చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలలో అధికార పార్టీ యంత్రాంగం అక్రమాలకు పాల్పడిందని, నిబంధనలను తుంగలో తొక్కి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అడ్డదార్లు తొక్కిందనీ ఆరోపించారు. అదే సమయంలో తన హయాంలో 2021లో జరిగిన స్థానిక ఎన్నికల గురించి లేశమాత్రమైనా ప్రస్తావించలేదు. మునిసిపోల్స్ లో ప్రజాతీర్పును అంగీకరించే సాహసం చేయలేని జగన్.. మొత్తంగా ఎన్నికల ప్రక్రియపైనే బురద జల్లే ప్రయత్నం చేశారు. అసలు ఇవి ఎలక్షన్లే కావని, ఇవన్నీ కేవలం సెలక్షన్లు మాత్రమేనంటూ వితండ వాదానికి తెరలేపారు. తన హయాంలొ నామినేషన్లు కూడా వేయనివ్వకుండా బలవంతపు ఏకగ్రీవాలతో అరాచకం సృష్టించిన చరిత్రను కన్వీనియెంట్ గా మరిచిపోయారు. ఇది కూడా చదవండి: నేను గానీ, ఒక్క సైగ గానీ చేస్తే.. ప్రత్యర్థులకు జగన్ వార్నింగ్.! ఇక తాజాగా జగన్ గురువారం (నవంబర్ 5) మీడియా సమావేశంలో మాట్లాడిన దానిని బట్టి, ఓటమి తప్పదన్న నిర్ణయానికి ముందే వచ్చేసి, ఆ ఒటమి నెపాన్ని పోలీసులు, ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై నెట్టేసి నైతిక విజయం తమదేనని చెప్పుకోవడానికి వృధా ప్రయత్నం చేశారని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిషత్ ఎన్నికలలో కనీసం పరువు దక్కే అవకాశాలే లేవన్న అంచనాతో జగన్ బెదరింపులకు తెగించారు. నిరాశా వాదం, నిర్హేతుక వాదనలతో జగన్ తన ప్రెస్ మీట్ ముగించారు. మొత్తంగా స్థానిక సమరంలో పార్టీ పరాజయానికి అధికార తెలుగుదేశం కూటమి కారణమంటూ నెపాన్ని నెట్టేసి, ప్రెస్ మీట్ మొత్తాన్నిస్వోత్కర్ష, పరనిందలకు పరిమితం చేశారు. కాగా ఓ వైపు జగన్ ప్రభుత్వ అధికార దుర్వినియోగం పై ప్రసంగిస్తుంటూ.. స్థానిక ఓటమిని శిరసావహిస్తున్నామనీ, వైసీపీపై ప్రజా వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనమనీ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరో ప్రెస్ మీట్ లో కుండబద్దలు కొట్టారు. పార్టీ తీరు ఇలాగే ఉంటే ఏ ఎన్నికలోనైనా ఇదే ఫలితం పునరావృతమౌతుందనిఅంగీకరించారు. మీకు నచ్చవచ్చు: [Jagan Press Meet on Municipal Results, Parishad Polls, Andhra Pradesh Political News, Telugu One]

Published on: Fri Nov 6, 2026 2:43PM

political-news-img

వెల్తారా, వెళ్లరా: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ హాజరుపై చర్చ.!

తెలుగు రాష్ట్రాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, రాజకీయ పంచాయతీలు మరోసారి తెరమీదకు వచ్చాయి. పెద్ద ఎత్తన చర్చకు తెరలేపాయి. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేడుకకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలు, అసలు మేనకోడలి వివాహ వేడుకకు జగన్ హాజరౌతారా అన్న సందేహాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఇటీవల కాలంలో వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలకు సంబంధించిన వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిర్వహించడానికి వైఎస్ షర్మిల జగన్ అనుమతి కోరారు. అయితే భద్రతా కారణాలు ప్రస్తావిస్తూ ఆ ప్రాంగణాన్ని వివాహ వేడుకకు ఉపయోగించేందుకు వైఎస్ జగన్ అంగీకరించలేదు. ఈ విషయంలో మరోసారి అన్నా చెళ్లెళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కుటుంబ భవనంలో వివాహం జరగకపోవడంతో, వివాహ వేదికను వేరే ప్రాంతానికి మారుస్తున్నట్లు వైఎస్ షర్మిల స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అదే సమయంలో అసలు ఎలహంక తన ఆస్తి అని కూడా విస్పష్టంగా ప్రకటించారు. అయితే కుమార్తె వివాహం నేపథ్యంలో తగాదాలు, అనవసర వివాదాలు ఎందుకని భావించి వేదికను మార్పు చేసినట్లు ఆమె ఆ సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలో నవంబర్ 25న జరగనున్న ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులందరూ హాజరవుతారా లేదా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకకు వైఎస్ జగన్ తన సతీమణితో కలిసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ కుటుంబ వేడుక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ తర్వాత కాలంలో రాజకీయ పరిణామాలు, ఆస్తుల పంపిణీ వివాదాలు మరింత ముదిరాయి. ఇది కూడా చదవండి: యలహంక ప్యాలెస్ నా ఆస్తి: షర్మిల సంచలన ప్రకటన.! తాజాగా ఇప్పుడు కుమార్తె వివాహం సందర్భంగా చోటుచేసుకున్న వేదిక మార్పు వివాదం నేపథ్యంలో.. ఈ వేడుకకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. సొంత చెల్లెలు కుమార్తె వివాహ వేడుకకు మేనమామ హోదాలో జగన్ హాజరై ఆశీర్వదిస్తారా లేక ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ మోహన్ రెడ్డి వైఎస్ అనీల్ రెడ్డి ఇంటో వివాహ వేడకకు హాజరయ్యారు. ఏపీలో మునిసిపల్, పరిషత్ ఎన్నికల కారణంగా జగన్ పొలిటికల్ గా చాలా చాలా బీజీ అయినప్పటికీ, వెసులుబాటు చేసుకుని చెన్నై వెళ్లి మరీ ఆ వివాహానికి హాజరయ్యారు. మరి ఇప్పుడు సొంత చెల్లెలి కుమార్తె వివాహానికి హాజరౌతారా? లేక చెల్లెలితో ఉన్న విభేదాల కారణంగా ముఖం చాటేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. మీకు నచ్చవచ్చు: యలహంక భూమి షర్మిలదే: కుండబద్దలు కొట్టిన విజయమ్మ: జగన్ కు షాక్.! ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.? [Will Jagan Attend YS Sharmila Daughter Wedding, Yelahanka Palace Controversy, YSR family Disputes, Anjili Reddy wedding, Telugu One]

Published on: Fri Nov 6, 2026 2:00PM

political-news-img

విజయవాడ మేయర్ ఎన్నిక: డిపాజిట్ కోల్పోయిన ఏబీవీ.. ఒటమి ఒప్పుకోలు.. అంతలోనే కుట్ర ఆరోపణలు.!

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఏబీ వెంకటేశ్వరరావు తొలుత హుందాగా ఓటమిని అంగీకరించారు. అయితే అంతలోనే ఏమైందో ఏమో.. తన ఓటమి వెనుక కుట్ర ఉందంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. దీంతో ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోటీ చేసిన విజయవాడ మేయర్ ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. నిజాయితీ పరుడిగా, మేధావిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మంచి గుర్తింపు ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు తొలుత ఓటమిని హుందాగా అంగీకరించారు. కానీ 24 గంటలు తిరగక ముందే తనను ఓడించేందుకు కుట్ర పన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెజవాడ మేయర్ ఎన్నికలో ఓటమి పాలైనా తాను రాజకీయాల నుంచి వైదొలగే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై కుట్ర పన్ని ఓడించారని ఆరోపించిన ఆయన, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను పట్టించుకోనన్నారు. విజయవాడ మేయర్ ఎన్నికలలో ఏబీవీ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగినప్పటి నుంచే ఆయన పోటీలో నిలవడం.. వైసీపీకి మేలు చేయడానికేనా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో వేధింపులకు గురైన ఆయన విజయవాడ మేయర్ అభ్యర్థిగా స్వతంత్రంగా బరిలోకి దిగడం వల్ల తెలుగుదేశం కూటమి ఓట్లు చీలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, దీని వల్ల ఏబీవీకి గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేకపోయినా, వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత ఏబీవీ పోటీ వల్ల తెలుగుదేశం కూటమి ఓట్లు చీలలేదని తేటతెల్లమైంది. దీంతో సోషల్ మీడియాలో ఏబీవీపై ఓ రేంజ్ లో విమర్శలు సెటైర్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఏబీవీ స్ట్రాంగ్ గా స్పందించారు. తన ఓటమికి కొందరు కుట్రపన్నారని ఆరోపించడంతో ఆగకుండా తాను ఓటమి పాలు కాలేదనీ, కొందరు తనను కావాలనే ఓడించారన్నారు. తనను నమ్మి ఓటు వేసిన 12 వేల మంది ప్రజల నమ్మకమే తనకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. తన పరువు పోయిందని కొందరు సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ పోస్టులు పెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: విజయవాడ మేయర్ ఎన్నికలో ఘోర పరాజయం: ఏబీవీ పొలిటికల్ ఎంట్రీపై నీలినీడలు.! విజయవాడ మేయర్ స్థానానికి పోటీ చేసినప్పుడు తాను కేవలం పదవి కోసం పాకులాడలేదని, ప్రజా సమస్యలపై గళం విప్పడమే తన ధ్యేయమని ఏబీవీ తెలిపారు. ముఖ్యంగా బుడమేరు సమస్యపై నిలదీయడం, ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాలను ప్రశ్నించడం తన బాధ్యతగా భావించానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇవన్నీ కేవలం రాజకీయ లబ్ది కోసం కాకుండా ప్రజాక్షేమం కోసమే చేశానని స్పష్టం చేశారు. తనను రాజకీయాలకు దూరం చేయాలని, తన నుంచి మద్దతుదారులను వేరు చేయాలని చూస్తున్న శక్తుల ప్రయత్నాలు నెరవేరవని ఏబీవీ హెచ్చరించారు.అ హేళనలతో, బురదజల్లే ప్రచారాలతో తనను వెనక్కి తగ్గించగలమని భావిస్తే వారు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నట్లేనన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. భవిష్యత్తులోనూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల గొంతుకగా మారుతానని ఏబీవీ కుండబద్దలు కొట్టారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది. మీకు నచ్చవచ్చు: ఏపీ పుర ఫలితాల్లో కూటమి హవా: వైసీపీ కుదేలు.! కుప్పంలో టీడీపీ ప్రభంజనం..32కు 32 వార్డులు కైవసం.! [AB Venkateswara Rao Sensational Comments on Defeat, Vijayawada Mayor Elections, Conspiracy, AP politics, Telugu One]

Published on: Fri Nov 6, 2026 11:54AM