TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్..!

Published on: Mon Sep 21, 2026 7:23PM

స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో సీఎస్‌కే కొత్త కోచ్‌గా మాజీ పేసర్..!

ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ఫ్రాంచైజీకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఈ జట్టు ఇప్పటివరకు ఏకంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచి సత్తా చాటింది. అయితే, గత కొన్ని సీజన్లుగా జట్టు ప్రదర్శనలో తడబాటు ఏర్పడింది. కీలక సమయాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ధోనీ ఫినిషింగ్ టచ్ ఇస్తాడని ఎరురుచూసినా ఆశించిన మ్యాజిక్ రిపీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సీఎస్‌కే యాజమాన్యం ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. జట్టులో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ, భారత మాజీ స్టార్ పేసర్, లెజెండరీ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ జహీర్ ఖాన్‌ను తమ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ సంచలన నిర్ణయాన్ని ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక ప్రకటనలో జహీర్ ఖాన్‌కు సాదర స్వాగతం పలికింది. దీంతో ఐపీఎల్ 2027 సీజన్ ద్వారా జహీర్ ఖాన్ తొలిసారిగా సీఎస్‌కే ప్రధాన కోచ్‌గా పూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు, సీఎస్‌కేతో సుదీర్ఘకాలం పాటు అనుబంధం ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. 2009 సంవత్సరం నుంచి సుమారు దశాబ్దానికి పైగా ప్రధాన కోచ్‌గా కొనసాగిన ఫ్లెమింగ్, 2026 సీజన్ ముగిసిన తర్వాత బాధ్యతల నుంచి వైదొలిగారు. ఫ్లెమింగ్ శకం ముగియడంతో కొత్త కోచ్ ఎవెవరు అవుతారనే దానిపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి మేధావి బౌలర్‌గా పేరు తెచ్చుకున్న జహీర్ ఖాన్‌ను ఎంపిక చేయడం ద్వారా యాజమాన్యం సరైన సంకేతాలు పంపింది.

భారత జాతీయ జట్టు తరఫున ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన జహీర్ ఖాన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉంది. మ్యాచ్‌లను మలుపు తిప్పడంలో ఆయన వ్యూహాలు ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇప్పుడు అదే వ్యూహాత్మక అనుభవాన్ని ఆయన సీఎస్‌కే కోచింగ్ సెటప్‌లో అమలు చేయనున్నారు. ఐపీఎల్ 2027 టోర్నమెంట్ కోసం జట్టులో సమూల మార్పులు, ఆటగాళ్ల సన్నాహాలు, బలమైన వ్యూహాల రూపకల్పనలో జహీర్ ఖాన్ పాత్ర అత్యంత కీలకం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 2010, 2011, 2018, 2021, 2023 సంవత్సరాలలో మొత్తంగా ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో పాటు అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన రికార్డు సీఎస్‌కే పేరిట ఉంది. ఇప్పుడు జహీర్ ఖాన్ రాకతో ఫ్లెమింగ్ తర్వాత మరో సువర్ణాధ్యాయానికి సీఎస్‌కే తెరలేపింది. ఐపీఎల్ 2027లో ఈ కొత్త కోచింగ్ జోడీ సీఎస్‌కేను ఏ విధంగా ముందుకు నడిపిస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 

 

 

[ Zaheer Khan, CSK Head Coach, IPL 2027, Chennai Super Kings, MS Dhoni, Stephen Fleming, Stephen Fleming ]