ఇంత కంటే నీచం ఉంటుందా: ఇంత దిగజారుడుతనమా.. జగన్ పై షర్మిల ఫైర్.!
Published on: Wed Nov 18, 2026 9:27AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వివాదం మరోసారి బహిర్గతమైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ జగన్ మీడియా ప్రచురించిన కథనంపై షర్మిల నిప్పులు చెరిగారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు. సాధారణ కుటుంబ సంబంధాలను కూడా వక్రీకరించి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.
మహిళలను గౌరవిస్తామని చెప్పే జగన్.. ఇలాంటి నిరాధారమైన, దిగజారిన వార్తలను తన సొంత మీడియా ప్రచురించడాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఈ ప్రచురణ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో జగన్ స్వయంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తమ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తన పిల్లల పెళ్లిళ్లకు అందరినీ ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయంగా ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, కుటుంబ వేడుకల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా షర్మిల అభివర్ణించారు.

అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో ఈ తాజా పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్ కుటుంబ వ్యవహారాలను బహిరంగ వేదికలపైకి లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని షర్మిల పదేపదే ఆరోపిస్తున్న సంగతి విదితమే.
ఇది కూడా చదవండి: వెల్తారా, వెళ్లరా: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ హాజరుపై చర్చ.!
అయినా.. తమ ప్రత్యర్థి అయితే చాలు… వ్యక్తిత్వహననానికి పాల్పడడం, మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటేనంటూ.. నాడు నిండు సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు సైతం షర్మిలపై అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.

అంతెందుకు గతంలో షర్మిల కూడా పలు సందర్భాలలో జగన్ ది సైతాన్ సైన్యం విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుకు తన కుమారుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు పసుపు రంగు చీర కట్టుకొని వెళ్లిన షర్మిలను దూషించిన ఘనత వైసీపీ సైకో సైన్యానిది. ఇప్పుడు కూడా తన కూతురు అంజిలి పెళ్లి పత్రిక అందించేందుకు చంద్రబాబును కలిసిన షర్మిలపై వైసీపీయులు దుర్భాషలాడుతున్నతీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది.
మీకు నచ్చవచ్చు: ఉంటే ఉండు, లేకుంటే దేశం విడిచిపో: వైఎస్ కంటే గొప్పోడివా.. జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల కుటుంబం.!
ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.?
[YSSharmila, YSJagan, SharmiladaughterMarriage, Invitation, CBN, CharacterAssassination, TeluguOne]


