TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యలహంక వివాదం: భారతి లేఖతో కొత్త మలుపు.!

Published on: Tue Nov 24, 2026 8:53AM

వైఎస్ కుటుంబ   ఆస్తుల వివాదం మరో కీ మలుపు తిరిగింది. బెంగళూరులోని యలహంక నివాసానికి సంబంధించిన చర్చలు, వివాహ వేదిక అంశాలు, కుటుంబ ఆస్తుల హక్కులపై నెలకొన్న విభేదాల మధ్య వైఎస్ భారతి రెడ్డి తన మరదలు వైఎస్ షర్మిలకు రాశారంటూ ప్రచారంలో ఉన్న ఓ   రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ   చర్చనీయాంశంగా మారింది.

షర్మిల కుమార్తె వివాహ వేడుకల నేపథ్యంలో యలహంక నివాసానికి సంబంధించి తలెత్తిన అభ్యంతరాలు, ప్రత్యామ్నాయ వేదిక చర్చల నడుమ వెలుగులోకి వచ్చిన వైఎస్ భారతి లేఖ  వివాదంలో కొత్త మలుపునకు కారణమైంది.  ఒకవైపు రాజకీయంగా వేర్వేరు దారుల్లో ఉన్న  జగన్, షర్మిల మధ్య ఆస్తుల అంశంలో జగన్ భార్య సతీమణి లేఖ కీలక మలుపునకు కారణమైంది.  

  కుటుంబ ఆస్తులపై జరుగుతున్న చర్చలు, వివాదాల నేపథ్యంలో కొన్ని వాస్తవాలను స్పష్టం చేయడానికే ఈ లేఖ రాసినట్లు షర్మిల పేర్కొన్నారు. కొన్ని నిర్దిష్ట ఆస్తులతో షర్మిలకు ఎటువంటి హక్కు గానీ, సంబంధం గానీ లేదని, ఆ ఆస్తులు తన తల్లిదండ్రులు, పుట్టింటి కుటుంబం బహుమతిగా, మద్దతుగా ఇచ్చినవనీ,  అలాగే తన  కష్టార్జితంతో సంపాదించుకున్నవని ఆ లేఖలో  భారతి పేర్కొన్నారు.   వీటితో   దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వాటా గానీ, షర్మిల హక్కులు గానీ లేవని పేర్కొంటూ, పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తులు మరియు స్వార్జిత ఆస్తులపై హక్కులు కోరడం లేదా వాటిని వివాదాల్లోకి లాగడం సరికాదని భారత ఆ లేఖలో పేర్కొన్నారు. 

భారతి రాసినట్లుగా ప్రచారం అవుతున్న ఈ లేఖతో యలహంక ఆస్తి యాజమాన్యం ఎవరిది అనే అంశంపై కొత్త  విశ్లేషణలు మొదలయ్యాయి. భారతి తల్లిదండ్రుల తరఫున యలహంక ఆస్తులు వచ్చాయన్న వాదన తెరపైకి రావడంతో, గతంలో జరిగిన పరిణామాల మళ్లీ తెరపైకి వచ్చాయి

ఇది కూడా చదవండి: యలహంక ప్యాలెస్ విషయంలో: జగన్ చట్టపరంగా పై చేయి.. నైతికంగా ఘోర పరాజయం.!

. ముఖ్యంగా గతంలో వైఎస్ విజయమ్మ పేరిట వచ్చిన అఫిడవిట్ లేదా కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం   వంటి అంశాల్లో జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి చిరునామా, షర్మిలకు యలహంక చిరునామా ఉన్న  అంశాలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అలాగే గతంలో సీబీఐ తనిఖీల నేపథ్యంలో అక్కడ షర్మిల, ఆమె కుటుంబం నివసిస్తున్న అంశం కూడా చర్చకు వస్తోంది.

మరోవైపు, వైఎస్ విజయమ్మ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చలో కీలకంగా నిలుస్తున్నాయి. కుటుంబ ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులేనని, వారసులందరికీ సమానంగా పంచిపెట్టాలన్న ఉద్దేశం వైఎస్ఆర్‌కు ఉండేదని, ఆయన ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని విజయమ్మ పేర్కొన్న అంశాలను గుర్తుచేస్తున్నారు. ఇలా ఒకవైపు ఉమ్మడి ఆస్తుల వాదన, మరోవైపు కోర్టుకు వెళ్లడం,  ఇప్పుడు పుట్టింటి ఆస్తులు, స్వార్జిత ఆస్తుల లేఖ అంశం కలగలిసి ఈ మొత్తం వ్యవహారాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి. 

మీకు నచ్చవచ్చు:   యలహంక ప్యాలెస్ నా ఆస్తి: షర్మిల సంచలన ప్రకటన.!

ఇంత కంటే నీచం ఉంటుందా: ఇంత దిగజారుడుతనమా.. జగన్ పై షర్మిల ఫైర్.!​

[YSBharati, Letter, YS Sharmila, YS Jagan, , Yelahanka dispute, YS family assets, TeluguOne]