వైఎస్ వివేకా హత్య వెనుక కుట్ర: భారీ స్కెచ్.. ఈడీ వేగం, మళ్లీ తెరపైకి అవినాష్ రెడ్డి.!
Published on: Sat Oct 3, 2026 9:42AM

ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయ్, మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈడీ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత వరకూ రాజకీయ కక్షలు, ప్రత్యక్ష శత్రుత్వాలు కారణంగా వివేకా హత్య జరిగిందని అంతా భావించారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి దర్యాప్తు వేగవంతం చేయడంతో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. వివేకా హత్య వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలు, పెద్ద ఎత్తున నిధుల గోల్‌మాల్ వంటి విషయాలు ఉన్నాయన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.
.webp)
ఈ కేసులో వైయస్ అవినాష్ రెడ్డి పేరు మరోసారి ప్రముఖంగా తెరపైకి వచ్చింది. దీంతో పొలిటికల్ హీట్ కూడా ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటివరకు సీబీఐ దర్యాప్తు కోణంలో సాగిన హత్య కేసు, ఈడీ ఎంట్రీతో పూర్తిగా ఆర్థిక నేరాల వైపు మళ్ళింది. వివేకానంద రెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన కోట్ల రూపాయల లావాదేవీలపై ఈడీ దర్యాప్తు సాగుతోంది.

ఈడీ నోటీసుల ప్రకారం, సంబంధిత వ్యక్తుల హవాలా లావాదేవీలు, అక్రమ ఆస్తుల ఆర్జనపై పక్కా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు రాత్రి జరిగిన ఫోన్ కాల్స్, కీలకమైన ప్రదేశాలలో నడిచిన ఆర్థిక ఒప్పందాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. రాజకీయ కుట్రల ముసుగులో జరిగిన వివేకా హత్య కేసులో ఆర్థిక కోణాలు, వాటికి సంబంధించిన ఆధారాలను ఈడీ ఒక్కొక్కటిగా సేకరిస్తూ నిందితులకు ఉచ్చు బిగిస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈడీ మరింత దూకుడుగా వ్యవహరించి, పెద్ద ఎత్తున ఆస్తుల జప్తుతో పాటు, సంచలన అరెస్టులు చేసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
[YS Vivekananda Reddy Murder Case, Avinash Reddy, ED Money Laundering Investigation, Andhra Pradesh, Telugu One]


