TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివేకా హత్య కేసు.. ఎర్రగంగిరెడ్డి, దేవినేని శివశంకర్ రెడ్డి, దస్తగిరికి ఈడీ నొటీసులు.!

Published on: Thu Sep 3, 2026 2:55PM

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.  ఈ కేసులో ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్న ఈడీ,  తాజాగా కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.  ఈ విచారణలో భాగంగా  ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో పాటు ఈ కేసుకు సంబంధించి అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరికి కూడా ఈడీ అధికారులు తాజాగా నోటీసులు పంపారు. వివేకా హత్య కేసులో  ఆర్ధిక లావాదేవీలు, నేరానికి వాడిన నిధులు, హత్యానంతరం జరిగిన పరిణామాల్లో చేతులు మారిన డబ్బు ప్రవాహంపై ఈడీ  దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ దర్యాప్తులో భాగంగానే   ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, దస్తగిరిలను నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది.   

ఈ హత్యకు సంబంధించి ఆర్ధికపరమైన మూలాలను ఛేదించడం లక్ష్యంగా  ఈడీ దర్యాప్తు సాగుతోంది. హత్య కోసం ఎవరి నుంచి నిధులు సమకూరాయి? హత్యానంతరం సాక్ష్యాలను తారుమారు చేయడానికి,  నిందితులను రక్షించడానికి భారీగా నగదు చేతులు మారిందా? అన్న దిశగా దర్యాప్తు సాగుతోంది. తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన వారి విచారణలో మరిన్నివివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.  

అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికే సీబీఐ పలు కీలక విషయాలు సేకరించగా, ఇప్పుడు ఈడీ అధికారులు ఆయనను విచారించడం ద్వారా మరిన్ని ఆర్థిక లావాదేవీల వివరాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే ఎర్ర గంగిరెడ్డి,  దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలను ప్రశ్నించడం ద్వారా ఈ కుట్రలో ఎవరెవరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయనే స్పష్టత వస్తుందని ఈడీ భావిస్తోందంటున్నారు.  

 

[YS Vivekananda Reddy murder case, ED investigation, Erra Gangi Reddy, Devireddy Shiva Shankar Reddy, Shaik Dastagiri, money laundering case, Telugu One]