TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివేకా హత్య కేసులో కీలక ట్విస్ట్.. డిశ్చార్జ్ పిటిషన్లు రిటర్న్!

Published on: Wed Sep 16, 2026 2:31PM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి తమను కేసు నుంచి డిశ్చార్జ్ చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను పరిశీలించిన నాంపల్లి  కోర్టు వాటిని రిటర్న్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్జ్‌షీట్ దాఖలైన తర్వాత డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసేందుకు నిర్ణీత గడువు ఉంటుందని కోర్టు పేర్కొన్నది. 

కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం చార్జ్‌షీట్ దాఖలైన 40 రోజుల్లోపే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.అయితే నిందితులు నిర్ణీత సమయంలో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయలేదని పేర్కొన్న కోర్టు.. గడువు తర్వాత దాఖలైన పిటిషన్లను స్వీకరించకుండా రిటర్న్ చేసింది.   ఈ పిటిషన్లను కేసు మెరిట్‌పై కొట్టివేయడం కాకుండా నిర్ణీత సమయంలో దాఖలు చేయలేదనే కారణంతో రిటర్న్ చేసింది.

దీంతో నిందితులు తదుపరి ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, నిందితుల అరెస్టులు, కోర్టు విచారణ వంటి అంశాలు   పలు దశల్లో కొనసాగుతున్నాయి. తాజా డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం కేసులో మరో కీలక న్యాయపరమైన పరిణామంగా మారింది.

[YS Viveka Murder Case, Discharge Petitions, Retun, Nampalle, CBI Court]