TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి నిశ్చితార్థం ఎప్పుడో తెలుసా?

Published on: Fri Sep 18, 2026 2:47PM

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, దివంగత వైఎస్ రాజశేఖరెడ్డి కుమార్తె షర్మిల కుమార్తె వివాహ నిశ్చితార్ధం తేదీ, వివాహ ముహూర్తం ఖరారయ్యాయి. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా షేర్ చేశారు.  నిత్యం  ప్రజా సమస్యలు, రాజకీయ పోరాటాలతో బిజీబిజీగా ఉండే షర్మిల ఇప్పుడు పూర్తిగా తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  సోషల్ మీడియా వేదికగా షర్మిల తన కుమార్తె వివాహ నిశ్చితార్థతేదీ, వివాహ తేదీలను ప్రకటించడంతో వైఎస్ అభిమానుల్లో ఆనందం వ్యక్త మౌతోంది. 

సామాజిక మాధ్యమ వేదిక ద్వారా ఆమె షేర్ చేసిన వివరాల ప్రకారం షర్మిల కుమార్తె అంజలిరెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహ నిశ్చితార్థం ఈ నెల 24 జరగనుంది. కుటుంబ సభ్యులు,  సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వార్త బయటకు వచ్చిన క్షణం నుంచే సోషల్ మీడియాలో షర్మిల కుటుంబానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్ కుటుంబ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ కాబోయే వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఏ వేడుక జరిగినా అది తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి చర్చనీయాంశం అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అంజిలి రెడ్డి నిశ్చితార్థం కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 24న జరగబోయే ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు, రాజకీయ ప్రముఖుల హాజరీపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంగేజ్మెంట్ వేడుకకు ఏర్పాట్లు వేగంగా జరుగుతుండగా, ఇరు కుటుంబాల మధ్య పెళ్లి పనులకు సంబంధించి కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇక అంజిలిరెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహం నవంబర్25న నిర్ణయించినట్లు షర్మిల తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. తొలి శుభలేఖ వైఎస్ఆర్  ఘాట్ వద్ద పెట్టి మహానేత ఆశీస్సులు తీసుకుంటామని   షర్మిల తెలిపారు. 


[YS Sharmila, Anjili Reddy, Somala Raghuram Reddy, Sharmila dDaughter Engagement, YSR Granddaughter Wedding]