TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మేనకోడలు వివాహ నిశ్చితార్థానికి జగన్ డుమ్మా: షర్మిల ఆహ్వానించినా గైర్హాజర్.. సంకేతం ఏంటి?

Published on: Fri Sep 25, 2026 2:54PM

 ఏపీసీసీ అధ్యక్షురాలు  షర్మిల కుమార్తె   అంజలి రెడ్డి  వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ శివారులో  ఘనంా జరిగింది.   అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ వేడుకకు రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.  అయితే..  ఈ  కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత   జగన్ గైర్హాజరయ్యారు. 

గురువారం (సెప్టెంబర్ 24)న  ఈ నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, పలువురు ప్రముఖ రాజకీయ నేతలు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థం జరిగింది. అయితే.. సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.

అప్పట్లో కూడా జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయి. అయినా జగన్ సతీసమేతంగా రాజారెడ్డి వివాహానికి హాజరై సందడి చేశారు. కానీ ఇప్పుడు హాజరు కాకపోవడంతో అప్పటి కంటే జగన్, షర్మిల మధ్య విబేధాలు తీవ్రమయ్యాయా, శుభకార్యానికి కూడా ముఖం చాటేసేంతగా ఇరువురి మధ్యా సంబంధాలు బెడిసాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజంగానే విబేధాలు తీవ్రంగా ఉంటే.. షర్మిల ఇటీవల స్వయంగా జగన్ నివాసానికి వెళ్లి మరీ ఆయనను తన కుమార్తె వివాహ నిశ్చితార్ధం, వివాహానికి రావాలని కోరుతూ శుభలేఖ ఇచ్చి మరీ ఆహ్వానించారు. 

షర్మిల స్వయంగా జగన్ ఇంటికి వెళ్లి ఆహ్వానపత్రిక అందచేసిన సందర్భంగా.. అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ సయోధ్య కుదురుతోందంటూ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  అయితే, ఇది   కుటుంబపరమైన ఆహ్వానం మాత్రమేనని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని షర్మిల అప్పుడే స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా షర్మిల స్వయంగా ఆహ్వానించారు. అలాగే జగన్ కూడా మేనకోడలి నిశ్చితార్ధ వేడుకకు హాజరౌతారని అంతా భావించారు. అయితే జగన్ హాజరు కాకపోవడంతో.. ఇరువురి మధ్యా అంతరం మరింత పెరిగిందనడానికి ఇదే సంకేతమని చెబుతున్నారు. 

అదలా ఉంటే.. మేనకోడలి వవాహ వేడుక సమయంలో జగన్ విదేశీ పర్యటకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకోవడం చూస్తుంటే.. జగన్, షర్మల మధ్య విభేదాలు రాజకీయాలు, ఆస్తుల పంపకం పరిధి దాటి ముందుకు వెళ్లాయని అంటున్నారు. 

వైఎస్సార్ కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తులకు సంబంధించి వివాదాలు నడుస్తున్న సంగతి విదితమే తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబ వేడుకలకు జగన్ హాజరుకాకపోవడం ఆ వివాదాలు ఇక సయోధ్యకు అవకాశం లేనంతగా ముదిరిపోయాయా అన్న చర్చకు తెరతీశాయి. పరిస్థితులు చూస్తుంటే వైఎస్ కుటుంబం ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు ఇక లేవా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. 

[YS Sharmila,YS Jagan Mohan Reddy, Anjili Reddy,  Engagementm YSR Family,  Politics, Familt, Disputes, Telugu, One]