TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళనాడు సీఎం విజయ్ తో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ: ఎందుకంటే.?

Published on: Thu Oct 8, 2026 3:00PM

విజయవాడలో జరగనున్న దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం(సెప్టెంబర్ 7)  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు. ఈ ఆహ్వానంపై విజయ్ సానుకూలంగా స్పందించారని, ఆయన ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇది జరిగి 24 గంటలు కాక ముందే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమిళనాడు సీఎం విజయ్ తో భేటీ అయ్యారు. తన భర్త అనిల్ లో కలిసి చైన్నైలో విజయ్ ను కలిసిన షర్మిల తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా తమిళనాడు సీఎం విజయ్ ను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షర్మిల స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయ్యింది. 

మొత్తంగా ఒక రోజు వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు సీఎం విజయ్ కు రెండు ఆహ్వానాలు అందడం విశేషం. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.   


[YS Sharmil Meet Vijay Thalapathy, Tamil Nadu CM Vijay, AP Congress, Sharmila Vijay Meeting, Anjili Reddy Wedding, Vijay TVK, Andhra Pradesh Politics, Telugu One]