TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అప్పుడు బొద్దింకలకు జై: ఇప్పుడు మోడీకి జైజై.. కన్ఫ్యూజన్ లో జగన్.!

Published on: Thu Oct 8, 2026 3:24PM

సింహం సింగిల్ గానే వస్తుందంటూ తన భుజాలను తానే చరచుకునే జగన్ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, తాను కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఆయనలోని అయోమయానికీ, కన్ఫ్యూజన్ కు అద్దంపట్టింది.  

గతంలో ఢిల్లీలో  కాక్రోచ్ జనతా పార్టీ  ఉద్యమం జరుగుతున్నప్పుడు, తాను కూడా   పోరాడే  బొద్దింకనని జగన్ ప్రకటించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను కాక్రోచ్ ల ఉద్యమంలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నానని విస్పష్ట సందేశాన్నిచ్చారు. జగన్ తన రాజకీయ జీవితంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా ఒక స్టేట్ మెంట్ ఇవ్వడం అదే ప్రథమం. 

దీంతో జగన్ ఇక తన పొలిటికల్ మార్గాన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఆరంభిస్తున్నారా అన్న అనుమానాలు అప్పట్లో వెల్లువెత్తాయి. దానికి కొనసాగింపుగానే జగన్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దగ్గరౌతున్నారన్న విశ్లేషణలూ వెల్లువెత్తాయి. ఇక సీపీఐ నేతలు ఆయనతో భేటీ కావడం ఈ విశ్లేషణలకు బలం చేకూర్చాయి కూడా. అయితే తాను ఏ కూటమిలోనూ భాగస్వామిని కాబోవడం లేదని జగన్ వివరణ ఇచ్చుకున్నారు. 

ఇప్పుడు తాజాగా ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రస్థానం ( గుజరాత్ సీఎంగా, పీఎంగా)  పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలపడం ద్వారా జగన్ తన కన్ఫ్యూజన్ ను బయటపెట్టుకున్నారు. మోడీని అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్ లో ప్రజా సేవలో మోడీ చారిత్రాత్మక మైలు రాయిని చేరుకున్నారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా పాతికేళ్లుగా  నిరంతర ప్రజా సేవను పూర్తి చేసుకున్న గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జగన్ సోషల్ మీడియాలో ఓ సందేశం షేర్ చేశారు.

నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  మొత్తానికి ఒకే సమయంలో  రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న  రాజకీయ నాయకుడిగా జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

[YS Jagan Praises Narendra Modi, Jagan Modi Tweet, YCP, CJP,  Andhra Pradesh Politics, Jagan Political Strategy, Duel Standards, Confusion, Telugu One]