Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూట్యూబర్ కోమలి ఆత్మహత్య
posted on: Feb 25, 2026 10:40AM

ప్రేమ విఫలమై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. ఆ ఆత్మహత్యకు పాల్పడిన మహిళ యూట్యూబర్ కావడం గమనార్హం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యూట్యూబర్ కోమలి, మణి కొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్నది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసు కుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. చదువుతో పాటు పార్ట్ టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక మైన గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూ బర్‌గా కొనసాగుతున్న అఖిల్ రెడ్డితో కోమలికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. మూడు సంవత్సరాలుగా కోమలి, అఖిల్ రెడ్డిలు ప్రేమలో ఉన్నారు. ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తి బ్రేకప్ అయ్యారు. అప్పటి నుంచి కోమలి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు కాపాడినట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం కోమలి అఖిల్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపా నికి గురైన కోమలి ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కోమలి ఆత్మహత్యతో చిత్రపురి కాలనీలో విషాద వాతా వరణం నెలకొంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే కోమలి అకాల మరణం ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.






