TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

యోగుల కొండపై మహాదీపోత్సవం: ఆధ్యాత్మిక శోభతో అలరారిన పవిత్ర పర్వతం.!

Published on: Wed Nov 25, 2026 9:43AM

పరమశివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం, అందులోనూ కార్తీక పున్నమి (నవంబర్ 24) రోజు వేళ అప్పలాయ కుంట వద్ద ఉన్న యోగుల కొండగా పిలవబడే  పర్వత శిఖరంపై కార్తీక మహాదీపం కనువిందు చేసింది. వేదమంత్రోచ్ఛారణలు, శివనామస్మరణల మధ్య కొండ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడంది. ఈ మహా దీపోత్సవాన్ని తిలకించేందుకు  పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీప దర్శనంతో పులకించి పునీతులయ్యారు. 

ఏకవీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ  కార్యక్రమానికి విచ్చేసిన ప్రతాప్ స్వామీజీ  మహాదీప ప్రజ్వలన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు.  భారీ సంఖ్యలో వత్తులను, పెద్ద మొత్తంలో నెయ్యి  వినియోగించారు.  చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించే దీపం మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని నింపుతుందనీ,   లోకకల్యాణం కోసం, సమాజంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఈ దీపోత్సవాన్ని నిర్వహించామనీ ప్రతాప్ స్వామీజీ తన సందేశంలో పేర్కొన్నారు.

యోగుల పర్వతం ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మిక వాతావరణానికి నెలవుగా నిలుస్తోంది. నిటారుగా సాగే కొండ  కొంతకాలంగా   ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అలరారుతోంది.

కార్తీక మాసంలో శివాలయాలు, పవిత్ర కొండలపై దీపాలు వెలిగించడం సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారం. అందులో భాగంగానే కార్తీక పౌర్ణమి నాడుమహాదీపోత్సవం నిర్వహించారు. యోగుల పర్వతంపై జరిగిన ఈ వేడుకలోనూ మహిళలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

ఇది కూడా చదవండి:  కార్తిక పౌర్ణమి వెన్నెల వెనుక దాగిన ఆరోగ్య రహస్యాలివే!

భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు, భద్రత, మార్గదర్శకాల విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిటారుగా ఉండే కొండ ఎక్కే మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అవసరమైన చర్యలు చేపట్టారు.

ఈ కర్యక్రమానికి వచ్చిన వశేష స్పందన పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. పవితమైన యోగుల కొండపై ముందు ముందు మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. 

మీకు నచ్చవచ్చు:  కార్తిక పౌర్ణమి: కిటకిటలాడుతున్న శివాలయాలు: తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ.!

కార్తీక పౌర్ణమి వేళ 365 వత్తుల దీపం.. ఉసిరి దీపం ఎందుకు అంత విశేషం.!

[Yogulakonda, Tirupati,   Kartika Deepam, Kartikapurnami,  festival,TeluguOne]