యలహంక భూమి షర్మిలదే: కుండబద్దలు కొట్టిన విజయమ్మ: జగన్ కు షాక్.!
Published on: Mon Oct 26, 2026 9:42AM

యలహంక భూమి, ఆస్తుల విషయంలో వైఎస్ సతీమణి, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సొంత తల్లి విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. యలహంక భూమి, ఆస్తులు తన కుమార్తె షర్మిలవేనని ఆమె గతంలో చేసిన ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ప్రాంగణంలో ఉన్న ఆస్తి, భూమి తన కుమార్తె వైఎస్ షర్మిలకు చెందినదేనని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి , జగన్, హర్మిల తల్లి వైఎస్ విజయమ్మ గతంలో విస్పష్టంగా ప్రకటించారు.
ఇప్పుడు షర్మిల కుమార్తె వివాహానికి యలహంక ప్యాలెస్ ను వేదికగా ఇవ్వలేనంటూ జగన్ మొండికేసిన నేపథ్యంలో గతంలో విజయమ్మ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సొంత తల్లే యలహంక ప్యాలెస్ ప్రాంగణంలోని భూమి షర్మిలదే అని ప్రకటించిన తరువాత జగన్ షర్మిల కుమార్తె వివాహ వేడుక జరుపుకోవడానిక ఆ ప్యాలెస్ ను ఎలా నిరాకరిస్తారని నెటిజనులు నిలదీస్తున్నారు.
ఇప్పటికే వివాహ వేదిక వివరాలను పేర్కొంటూ ఆహ్వాన పత్రికలను ముద్రించి బంధుమిత్రులకు పంపిణీ చేసిన తరువాత.. ప్రాంగణంలో పెళ్లి వేడుక నిర్వహించడానికి వీలులేదంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డుకోవడంపై వైఎస్ కుటుంబ సభ్యుల నుంచే కాకుండా.. వైఎస్ అభిమానులు, సామాన్య జనం నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల కుమార్తె వివాహవేడుకకు యలహంక ప్యాలెస్ వేదిక చేస్తూ.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని, జగన్ ఓ లేఖ ద్వారా తన అభ్యంతరాలను వెల్లడించిన నేపథ్యంలో జగన్, షర్మిల మధ్య విభేదాలు, ఆస్తుల వివాదం మరోసారి రచ్చకెక్కింది.

యలహంక ప్యాలెస్ తనదనీ, తన భద్రత, తన కుటుంబ భద్రత దృష్ట్యా అక్కడ షర్మిల వివాహం జరిగేందుకు అంగీకరించలేననీ జగన్ పేర్కొనడంతో కుటుంబ విభేదాలు. ఆస్తుల వివాదాలు మరో సారి రచ్చకెక్కాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ విజయమ్మ గతంలో విడుదల చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజశేఖరరెడ్డి మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబానికి చెందినవేనని, వాటిని నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఆశయమని విజయమ్మ ఆ ప్రకటనలో గుర్తుచేశారు.
వైఎస్ఆర్ఆర్ మరణానంతరం ఆస్తుల పంపకాల విషయంలో జరిగిన ఒప్పందాల ప్రకారం షర్మిలకు దక్కాల్సిన ప్రతి ఆస్తి ఆమెకు చెందాలని, కానీ ఆచరణలో ఆమెకు అన్యాయం జరుగుతోందని విజయమ్మ ఆరోపించారు. సరస్వతి సిమెంట్ కంపెనీతో పాటు, అప్పట్లో కుదిరిన అవగాహన ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, బెంగళూరులోని యలహంక భూమి, ఆ ప్యాలెస్ ప్రాంగణానికి సంబంధించిన హక్కులు పూర్తిగా షర్మిలవేనని విజయమ్మ విస్పష్టంగా ప్రకటించారు. జగన్ ఆ ఆస్తిపై సర్వాధికారాలూ తనవేననడం పూర్తి అభద్ధమని విజయమ్మ గతంలోనే కుండబద్దలు కొట్టారు.
[Yelahanka Land Dispute, YS Sharmila, YS Jagan Mohan Reddy, YS Vijayamma Statement, YS Family Properties, Telugu One]


