క్రెడిట్ వార్ లో తప్పుటడుగులు.. లోపభూయిష్టంగా వైసీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్.!
Published on: Fri Sep 4, 2026 10:36AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఒక వారంలోనే వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువను ప్రారంభించి, రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. మరోవైపు, ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
ఇక పోలవరం ఎడమ కాలువ పనులను చేపట్టింది.. సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగనే అంటూ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ శతధా ప్రయత్నిస్తోంది. అయితే వైసీపీ ఎకో సిస్టమ్ లో ఒక మాటకు కట్టుబడి ఉండటం అన్నది కనిపించదు. ఈ క్రెడిట్ వార్ లోనూ అదే జరుగుతోంది. పార్టీ అధినేత జగన్ అమరావతి విషయంలో, మూడు రాజధానుల విషయంలో, అలాగే మావిగన్ అంటూ పూటకో మాట, రోజుకో ప్రతిపాదనా అన్నట్లుగా వ్యవహరించిన తీరుగానే.. వైసీపీ సోషల్ మీడియా కూడా క్రెడిట్ వార్ లో రోజుకో మాట మారుస్తోంది. పోలవరం ఎడమ కాలువ జగన్ ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తూ పోస్టులు వెల్లువెత్తించిన మరుసటి రోజే మాట మార్చి.. పోలవరం ఎడమ కాలువ పనుల్లో లోపాలున్నాయనీ, కొన్ని చోట్ల నీరు లీక్ అవుతోందంటూ కొత్త ప్రచారాన్ని తలకెత్తుకుంది.

ఒకవేళ నిజంగానే పనుల్లో లోపాలు ఉంటే, ఆ లోపాలు జగన్ హయాంలోనే జరిగినవి అని వైసీపీ చెప్పుకుంటున్నట్లే లెక్క.. ఎందుకంటే పోలవరం ఎడమ కాలువ తమ అధినేత క్రెడిటే అని వాదిస్తోంది కనుక. ప్రాజెక్టు తమదే అని చెప్పుకుంటూనే, అందులో లోపాలు ఉంటే మాత్రం అవి చంద్రబాబు, తెలుగుదేశంల నిర్వాకమేనని సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న ప్రచారం ఫ్లాప్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[YCP Social Media Flawed, YS Jagan, YSR Congress social media strategy, Polavaram Left Canal, Chandrababu Naidu, AP irrigation projects, Telugu One]


