తెలుగుదేశంలోకి వలసలు: వైసీపీలో అసలేం జరుగుతోంది
Published on: Thu Oct 22, 2026 4:30PM

ఏ రాజకీయ పార్టీలోనైనా ఎన్నికల సమయంలో, అలాగే రాజకీయంగా సవాళ్లు ఎదురౌతున్న సమయంలో నాయకులు, శ్రేణులూ కూడా విభేదాలు విస్మరించి ఐక్యంగా ముందుకు సాగుతారు. ఇక పార్టీ అధినాయకత్వం, నాయకులు కూడా పార్టీ శ్రేణులను, క్షేత్రస్థాయి నాయకులను కాపాడుకునేందుకు నడుం బిగించి రంగంలోకి దిగుతుంది. కానీ స్థానిక ఎన్నికల వేళ వైసీపీలో ఆ పరిస్థితి కలికానిక్కూడా కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో, కీలక నియోజకవర్గాలలో స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి అధికార తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. ఈ వలసలు వరద గోదారిలా ఉధృతంగా సాగుతుండటం, వైసీపీ నాయకత్వం నిస్సహాయంగా చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడటం పొలిటికల్ సర్కిల్స్ లో
ఏదో ఒకరిద్దరు నాయకులు, ఏదో ఒకటి రెండు నియోజకవర్గాలు అంటే ఏమోలే అనుకోవచ్చు. కానీ వైసీపీ నుంచి వలసల పర్వం.. ఒకరిద్దరు నేతలు, ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితం కాకుండా, రాష్ట్రంలో దాదాపు సగం నియోజకవర్గాలలో పదుల సంఖ్యలో నాయకులు, వందల సంఖ్యలో కార్యకర్తలు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ వలసలు మహోధృతంగా సాగుతున్నాయి. మంగళగిరిలో దాదాపు 150 కుటుంబాలు రాత్రికి రాత్రి వైసీపీకి రాంరాం చెప్పేసి మంత్రి నారా లోకేష్ సమక్షంలో సైకిల్ ఎక్కేశాయి.

అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోనూ భారీగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో వైసీపీ పటిష్టంగా ఉందనుకుంటున్న తరుణంలో, తాజాగా వంద మందికి పైగా నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు ఇలా దాదాపుగా రాష్ట్రంలో సగానికి పైగా నియోజకవర్గాలలో వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత కీలకమైన స్థానిక ఎన్నికల వేళ ఇలా వైసీపీ ఖాళీ అయిపోతుండటం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
[YCP Leaders Joining TDP, YCP Defections, Mangalagiri, Sarvepalli, AP Politics, More Than Half Constiyuencies, Telugu One]


