TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్థానిక సమరం: జగన్ ఇలాకాలోనే వైసీపీ పరిస్థితి ఇలాగైందేంటి.?

Published on: Mon Oct 19, 2026 12:30PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ పార్టీపై పట్టు కోల్పోతున్నారా? ఆయన ఎంత గట్టిగా హెచ్చరించినా.. పార్టీ నేతలు ఆయన మాటలను పట్టించుకోవడం లేదా? హెచ్చరికలను లెక్క చేయడం లేదా? ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. ఆయన సొంత ఇలాకాలోనే పార్టీ నేతలూ, శ్రేణులూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారని చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా ఆయన సొంత ఇలాకా కడపలోనే స్థానిక ఎన్నికలలో వైసీపీ కనీసం సగం స్థానాలలో కనీసం నామినేషన్ కూడా దాఖలు చేయకపోవడాన్ని ఎత్తి చూపుతున్నారు. 

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.   జిల్లాలోని మొత్తం 10 మున్సిపాలిటీలకు గాను కేవలం మూడు చోట్లలో మాత్రమే వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగలిగారు.

తాజాగా వెలువడిన వివరాల ప్రకారం, కడప కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బండి దీప్తి, పులివెందులలో జగన్ బంధువు వైఎస్ ప్రమీలాదేవి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నరసింహారెడ్డి మాత్రమే బరిలో నిలిచారు. మిగిలిన ఎర్రగుంట్ల, రాజంపేట, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి,  కమలాపురం నియోజకవర్గాల్లో పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఆయా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఏకగ్రీవం అయనట్లే.  జగన్ సొంత జిల్లాలోనే సగానికి పైగా స్థానాల్లో పార్టీ పోటీకి దూరంగా ఉండటం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది.  

ఈ పరిణామం వైసీపీ అధినాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కంచుకోటగా  భావించే కడప జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావడం పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఖాయమని చెబుతున్నారు.  


[YCP Faces Adverse Conditions Kadapa Forte,  Municipal Elections, Pulivendula,  Andhra Pradesh Politics, Telugu One]