TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్థానిక ఎన్నికలు.. వైసీపీ పగటి కలలు.!

Published on: Wed Aug 26, 2026 10:53AM

ఏపీలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది.  ప్రభుత్వం నుంచి స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన సంకేతం వచ్చింది. మోస్ట్లీ మరో నెల రోజులలో స్థానక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలు, శ్రేణులకు స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.  అయితే..   జగన్‌తో  పార్టీ నేతలూ,  క్యాడర్ కు ఇస్తున్న ఆదేశాలు విస్మయం గొలుపుతున్నాయి.

ఇటీవల పార్టీ నాయకులతో సమావేశమైన జగన్..   ప్రతి స్థానిక సంస్థ స్థానంలోనూ పార్టీ అభ్యర్థులు గట్టిగా పోటీ చేయాలన్నారు. ప్రతి కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ  స్థానంలోనూ  వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వాలని ఆదేశించారు.  ఏకగ్రీవంగా ఒక్క స్థానాన్ని కూడా తెలుగుదేశం కూటమికి వదిలేయవద్దని నిర్దేశించారు. ఈ సమయంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు జగన్ కు గట్టి భరోసా ఇచ్చారు. స్థానిక  ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి స్థానంలోనూ పోటీకి పార్టీ సర్వ సిద్ధంగా ఉందన్నారు.  ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగితే అన్ని స్థానాలనూ వైసీపీ గెలుచుకుంటుందన్నారు. అయితే  పార్టీ అధినేత జగన్  బెంగళూరులోని తన నివాసానికే పరిమితమై, పార్టీ నేతలకూ, శ్రేణులకూ అందుబాటులో ఉండడం లేదన్న విషయాన్ని ఇక్కడ జగన్, అంబటిలు కన్వీనియంట్ గా మరచిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జగన్ తీరు పట్ల ఇప్పటికే పార్టీ నేతలు, శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది.  ఆ విషయం స్పష్టంగా కనిపిస్తున్నా.. స్థానిక ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించాలంటూ పార్టీ శ్రేణులకు జగన్, అంబటి చేస్తున్న దిశానిర్దేశం, ఇస్తున్న ఆదేశాలు అతివిశ్వాసంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. స్థానిక ఎన్నికలలో గెలుపు పట్ల జగన్ పగటి కలలకు కంటున్నారని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  

YCP day drems on localbodie elections,  YS Jagan Mohan Reddy, YCP Local Body Elections, AP Politics, TeluguOne