TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పారిపోయింది నేను కాదు వల్లభనేని వంశీ: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.!

Published on: Thu Oct 15, 2026 4:10PM

గన్నవరం రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం మరొకసారి పీక్స్ కు చేరింది. మాజీ, ఎమ్మెల్యే  వైసీపీ సీనియర్ నాయకుడు  వల్లభనేని వంశీ విసిరిన విమర్శలు, సవాళ్లకు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాస్  కౌంటర్ ఇచ్చారు. గురువారం (అక్టోబర్ 15) మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ.. తన వెనుక ఒక బలమైన నాయకుడు ఉన్నారని, ఆయన కుమారుడు ప్రతి అంశంలోనూ లెక్కలు సరిగ్గా సరిచేస్తారని పరోక్షంగా చంద్రబాబు, లోకేష్ లను ప్రస్తావిస్తూ వల్లభనేని వంశీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.  గన్నవరం నియోజకవర్గంలో గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ వంశీని నిలదీశారు.    

ప్రతికూల పరిస్థితులను ఎదిరించి  గెలిచి, నిలిచిన  తనను పపారిపోయానని వంశీ విమర్శించడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. 

గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, గతంలో గన్నవరం అసెంబ్లీ టికెట్ దక్కక నియోజకవర్గాన్ని వదిలి విజయవాడకు పారిపోయింది తాము కాదని,   వంశీయేనని స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నామని, పారిపోయే తత్వం తని కాదని యార్లగడ్డ అన్నారు.  

 అనవసరమైన ఆరోపణలు చేయడం మాని, చేసిన తప్పులను ఒప్పకోవాలని వంశీకి  హితవు పలికారు. గన్నవరం అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తమ ప్రాధాన్యమని, నిందలు వేసే నాయకులకు స్థానిక ప్రజలే త  బుద్ధి చెబుతారన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి అంశంపైనా స్పష్టత వస్తుందని, అక్రమాలకు, అనవసర విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని యార్లగడ్డ విశ్వాసం వ్యక్తం చేశారు.  


[Yarlagadda Venkat Rao Counter Vallabhaneni Vamsi, Gannavaram Politics, Gannavaram MLA, AP Political News, Telugu One]