TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యనమలకు అస్వస్థత: ఆస్పత్రిలో చేరిక.!

Published on: Thu Oct 22, 2026 1:02PM

తెలుగుదేశం సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్,  మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన కాకినాడలోని ఓ ప్రైవేటు ప్రస్తుతం ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. యనమల అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే యనమలకు చికిత్స అందిస్తున్న వైద్యులతోనూ ఫోన్ లో మాట్లాడారు.  

అంతేకాకుండా, యనమల రామకృష్ణుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు   తెలియజేయాలని స్థానిక పార్టీ ముఖ్య నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అకస్మాత్తుగా తలెత్తిన ఈ ఆరోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, వైద్యుల హెల్త్ బులెటిన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. యనమల అస్వస్థత వార్త తెలియడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఇలా ఉండగా, యనమలకు వైద్యులు స్టంట్లు అమర్చినట్లు సమాచారం.  రాష్ట్ర రాజకీయాలలో ఆర్థిక విషయాలపై గట్టి పట్టున్న సీనియర్ నాయకుడిగా యనమలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీకి అండగా నిలుస్తూ కీలక సలహాలు ఇస్తూ వస్తున్న ఆయన అస్వస్థతకు గురికావడం పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేసింది.   ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు. 

[Yanamala Ramakrishnudu‎ Hospitalised,  TDP Senior Leader, Kakinada Private Hospital, Yanamala Health, CBN, Phone, Telugu One]