నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు.. బాలల వేడుకలో పాడనా తెలుగు పాట పోటీలు.!
Published on: Wed Sep 9, 2026 5:59PM
.webp)
ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ 5, 6 తేదీలలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో పాడనా తెలుగు పాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు - బాలలు కార్యక్రమం సందర్భంగా 16 ఏళ్ల లోపు బాలబాలికల కోసం డాక్టర్ భానుమతి రామకృష్ణ వేదికపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న ఆయన.. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరారు.

పాడనా తెలుగు పాట కార్యక్రమంలో పాల్గొన దలచిన వారు.. ప్రాథమిక పరిశీలన, ఎంపిక కోసం కరోకే మీడయం ద్వారా రెండు పాటలను రికార్డ్ చేసి ఈ నెల 30 లోగా జొన్నలగడ్డ వల్లీ శ్రీవిద్యకు srividyajv8@gmail.com మెయిల్ చేయాలన్నారు. వాటిని పరిశీలించి ఎంపికైన వారికి వచ్చే నెల 15లోగా నేరుగా సమాచారం అందిస్తామని గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన వారు డిసెంబర్5,6 తేదీలలో జరిగే పాడనా తెలుగు పాట కార్యక్రమంలో రెండు గీతాలు పాడాల్సి ఉంటుందనీ, వాటిలో ఒకటి సోలో, మరొకటి యుగళగీతం పాడాల్సి ఉంటుందని వివరించారు. అయితే ఆ పాటలు తెలుగు సాహిత్య , సంగీత విలువలతో కూడినవి అయి ఉండాలనీ, అశ్లీలగీతాలు, అలాగే జాతీయ సమైక్యతకు విరుద్ధంగాఉన్న గీతాలు పాడకూడదన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో పాడేందుకు ఎంపికైన వారికి వసతి, రవాణా సౌకర్యాలు సార్వస్వత పరిషత్ ఏర్పాటు చేస్తుందని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే పాడిన వారికి వేదికపై ప్రశంసాపత్రం, శాలువా, మెడల్ తో సత్కరిస్తామని సారస్వత పరిషత్ కార్యదర్శి రెడ్డప్ప ధవేజీ, కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ కే మురళీధర్ రెడ్డి, కోగంటి శ్రీకాంత్ వివరించారు.
[World Telugu Maha Sababu, Balala Veduka, Padana Telugu Pata Competitions, Gajal Srinivas, Telugu One]


