TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నమో స్టేడియంను తలదన్నేలా హైదరాబాద్ క్రికెట్ స్టేడియం.!

Published on: Mon Aug 31, 2026 10:47AM

ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా గుజరాత్  రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో ని నరేంద్రమోడీ స్టేడియం ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దానిని తలదన్నేలా అంతకంటే భారీ క్రికెట్ స్టేడియంను నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ క్రియెట్ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం లక్షా 32 వేలు కాగా, అంతకు మించిన సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంకు వచ్చి క్రికెట్ మ్యాచ్ లను వీక్షేంచేలా హైదరాబాద్ వేదికగా భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందాయి. తెలంగాణ సీఎం రేవంత్ రేడ్డి సర్కార్ ఈ ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 

ముచ్చెర్ల సమీపంలో నిర్మితమౌతున్న ఇండియన్ ఫ్యూచర్ సిటీ లో ఈ స్టేడియంనే నిర్మించాలని రేవంత్ నిర్ణయించారు. ఇందు కోసం వంద ఏకరాలు కేటాయించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐకి అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపించింది.  రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తుంది. బీసీసీఐ నిర్మాణ వ్యయం భరించేలా తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు పంపింది.  ఔటర్ రింగ్ రోడ్,  రీజినల్ రింగ్ రోడ్లతో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి  సులభంగా, వేగంగా చేరుకునే విధంగా ఈ ప్రాంగణానికి రహదారి అనుసంధానం డిజైన్ పనులు సాగుతున్నాయి. 

ఈ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే కాకుండా,  అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్లు,ఇతర కాన్సర్ట్‌లు నిర్వహించేలా ఒక మల్టీపర్పస్ క్రీడా వేదికగా ప్రణాళికలు రూపొందాయి.  భారత్ ఫ్యూచర్ సిటీలో రాబోతున్న స్పోర్ట్స్ సిటీ, టూరిజం హబ్,  నెట్ జీరో సిటీ కాన్సెప్ట్‌లో ఈ క్రీడా ప్రాంగణం   మైలురాయిగా మారనుంది. ఈ ఏడాది  డిసెంబర్‌లోనే ఈ భారీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగే అవకాశం ఉందని తెలుస్తోంది.  


{World Largest Stadium in Hyderabad, Telangana largest cricket stadium, Hyderabad Future City,  Mucherla sports city,  BCCI new stadium}