TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్లి రహస్యం.. మొగుడు మాయం

Published on: Sat Sep 19, 2026 1:31PM

ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. జీవితాంతం తోడుగా నీడగా ఉంటానని బాసలు చేశాడు. పెద్దలు అంగీకరించడం లేదంటూ.. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో  రహస్యంగా వివాహం చేసుకున్నాడు. కట్ చేస్తే.. పెళ్లి తరువాత కనిపించకుండా మాయం అయ్యాడు. దీంతో బాధితురాలు..  తన భర్త కనిపించకుండా పోయాడంటూ  మచిలీపట్నంలో అత్తవారింటి ముందు.. అంటే తనను పెళ్లి చేసుకుని మాయమైపోయిన వ్యక్తి నివాసం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.  

వివరాలిలా ఉన్నాయి. మచిలీపట్నం పట్టణానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ,   ఫణికుమార్‌ గత ఆగస్టు 30 బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి హడావుడి లేకుండా రహస్యంగా వీరి వివాహం జరిగింది.  పెళ్లి అనంతరం ఈ నూతన దంపతులు కొద్దిరోజుల పాటు మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్‌ సమీపంలో ఉన్న ఫణికుమార్‌ కుటుంబసభ్యుల ఇంట్లోనే నివాసం ఉన్నారు.

అయిత.. వీరి పెళ్లి అత్తింటి వారికి నచ్చ లేదు. దీంతో   కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో.. ఈ వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఫణికుమార్‌ స్థానిక శక్తి గుడి ప్రాంతంలో మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంట్లో తనను   ఒంటరిగా విడిచిపెట్టి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. రోజులు గడిచినా  పాటు భర్త జాడ లేకపోవడంతో ఆందోళనకు గురైన జయలక్ష్మి అత్తవారింటికి వెళ్లారు.  అయితే అక్కడ జయలక్ష్మికి నిరాదరణ ఎదురైంది. ఆమెను  ఇంట్లోకి రానీయకుండా తీవ్ర అవమానించారు. భర్త ఆచూకీ గురించి ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారు కానీ అతడి ఆచూకీ మాత్రం చెప్పలేదు. దీంతో అత్తింటి వారే   భర్తను ఎక్కడో దాచిపెట్టారని జయలక్ష్మి ఆరోపిస్తున్నారు. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త ఇలా అర్ధాంతరంగా అదృశ్యమవడం, అత్తవారింటి వారి నిరాదరణతో  బాధితురాలు  ఆవేదన వ్యక్తం చేశారు.   తన భర్తను తనకు అప్పగించే వరకూ కదిలేది లేదని అత్తింటి ముందే బైఠాయించారు.  

[Woman Protest Machilipatnam, Secret Marriage Dispute, Kanakad Durga Temple Wedding, Husband Missing, Jayalakshmi Phani Kumar]