చలికాలంలో, కురులు చిట్లిపోతున్నాయా? జుట్టు పెరుగుదలకు బెస్ట్ టిప్స్ ఇవే
Published on: Thu Nov 19, 2026 9:30AM

చలికాలం రాగానే చాలామందిని వేధించే పెద్ద సమస్య జుట్టు రాలడం మరియు జుట్టు పెరుగుదల మందగించడం. మారుతున్న వాతావరణం, పొడి గాలి, ఆహారపు అలవాట్ల వల్ల దువ్వెన పట్టినప్పుడల్లా వెంట్రుకలు ఊడిపోతూ ఆందోళన కలిగిస్తాయి. అయితే నిపుణుల ప్రకారం చలికాలంలో హెయిర్ గ్రోత్ పూర్తిగా ఆగిపోదు, కానీ వేగం మాత్రం తగ్గుతుంది. చల్లని గాలి కారణంగా తల చర్మంలోని రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీనివల్ల జుట్టు కుదుళ్లకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు తగ్గిపోయి వెంట్రుకలు బలహీనపడతాయి. దీనికి తోడు శరీరంలో విటమిన్ డి లోపం కూడా జుట్టు పెరుగుదల తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా నిలుస్తుంది.
చలికాలంలో మనం వేసుకునే ఉన్ని టోపీలు, స్కార్ఫ్ల రాపిడి వల్ల కూడా వెంట్రుకలు చిక్కులు పడి మధ్యలోనే తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ కలరింగ్, బ్లీచింగ్, స్ట్రెయిట్నర్లు వంటి స్టైలింగ్ సాధనాలను తరచూ వాడటం వల్ల కురులు తేమ కోల్పోయి నిర్జీవంగా మారుతాయి. చలిని తట్టుకోవడానికి మరీ వేడినీళ్లతో తలస్నానం చేస్తే జుట్టులోని సహజ నూనెలు పూర్తిగా పోతాయి. అందుకే ఎప్పుడూ గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. వారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.
జుట్టు కుదుళ్లకు తిరిగి బలం చేకూర్చాలంటే రోజుకు 10 నిమిషాల పాటు సున్నితమైన ఆయిల్ మసాజ్ ఎంతో మేలు చేస్తుంది. గోరువెచ్చని కొబ్బరి నూనె, ఆముదం లేదా ఆర్గాన్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల తల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడి హెయిర్ గ్రోత్‌కు తోడ్పడుతుంది.

షాంపూ విషయంలో సల్ఫేట్, పారాబెన్ లేని మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంచుకోవాలి. గ్లిజరిన్, హయలురోనిక్ యాసిడ్, షియా బటర్ ఉన్న కండీషనర్లు వాడటం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. అలాగే వారానికి ఒకసారి డీప్ కండీషనింగ్ హెయిర్ మాస్క్ వేసుకుని 30 నిమిషాల తర్వాత కడిగేస్తే కురులకు లోతైన తేమ అందుతుంది.
ఇది కూడా చదవండి:స్టెంట్లు, బైపాస్ సర్జరీల వల్ల ఆయుష్షు పెరుగుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది?
తలస్నానం తర్వాత జుట్టు కొద్దిగా తడిగా ఉన్నప్పుడే వెంట్రుకల చివర్లకు హెయిర్ సీరమ్ రాయాలి. ఇది బయటి పొడిగాలి నుంచి కురులకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి 6 నుంచి 8 వారాలకు ఒకసారి జుట్టు చివర్లను కొద్దిగా కత్తిరించుకోవడం వల్ల చిట్లిపోయే సమస్య తగ్గి ఆరోగ్యకరమైన పెరుగుదల కనిపిస్తుంది. బయటి సంరక్షణతో పాటు లోపలి పోషణ కూడా అంతే ముఖ్యం. ఆహారంలో బయోటిన్, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
(24).webp)
గుడ్లు, బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, ఆకుకూరలు, చేపలు, అవకాడో వంటి పోషకాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం మర్చిపోకూడదు. ఈ చిన్న మార్పులతోనే చలికాలపు జుట్టు సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ఒకవేళ విపరీతంగా జుట్టు ఊడిపోతున్నా, తలపై ప్యాచెస్ లాగా బట్టతల కనిపిస్తున్నా లేదా చుండ్రు సమస్య తీవ్రంగా ఉన్నా సొంత చిట్కాలు ఆపి వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.
మీకు నచ్చవచ్చు:నేచర్ ప్రిస్క్రిప్షన్: డాక్టర్లు సైతం సిఫారసు చేస్తున్న ,అద్భుతమైన ప్రకృతి రహస్యం!
సరికొత్త క్యాన్సర్ చికిత్సలు: వైద్య రంగంలో నూతన మైలురాళ్ళు ఇవే!
Winter Hair Growth, Winter Hair Care Tips, Stop Winter Hair Fall, Scalp Hydration Tips, Healthy Hair Routine, Dermatologist Hair Advice, Health Tips In Telugu.


