TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంచితనం మంచిదే.. కానీ అందరి ముందు దాన్ని గొప్పగా బయటపెట్టాలని చూస్తే జరిగేది ఇదే..!

Published on: Sat Oct 24, 2026 10:50AM

మంచితనం మంచిదే.. కానీ అందరి ముందు దాన్ని గొప్పగా బయటపెట్టాలని చూస్తే జరిగేది ఇదే..!

జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి. ఎన్ని తరాలు మారినా చాణక్యుడు చెప్పిన మాటలు అందరికీ వర్తించేలా ఉంటాయి.  మనిషి స్వభావంలో నిజాయితీ ఉండటం చాలా మంచి గుణం. కానీ, అదే నిజాయితీని , మంచితనాన్ని అందరి ముందూ అతిగా ప్రదర్శించడం    మాత్రం అది చాలా ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. నేటి ఆధునిక సమాజంలో ప్రతీ ఒక్కరినీ గుడ్డిగా నమ్మడం, మన వ్యక్తిగత విషయాలన్నింటినీ ఇతరుల ముందు ఓపెన్ గా చెప్పుకోవడం  ఎంత ప్రమాదకరమో చాణక్య నీతి స్పష్టంగా తెలియజేస్తుంది.మంచితనం మంచిదే కానీ.. నిజాయితీగా, వ్యక్తిగత విషయాలను అందరూ మంచివారే అనే అమాయకత్వంతో చెప్పుకోకూడదట.  ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతుందో చాణక్యుడు వివరంగా చెప్పాడు.  ఆ విషయాలేంటో తెలుసుకుంటే..

అందరినీ నమ్మకూడదు..

సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో నలుగురితో మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరికీ చెడు చేయకూడదనే భావనతో ప్రవర్తిస్తారు. అయితే, ఈ లోకంలో అందరూ ఒకే రకమైన మనస్తత్వంతో ఉండరని గుర్తుంచుకోవాలి. మనం అందరితోనూ చాలా నిష్కల్మషంగా ఉంటూ, మన మనసులోని ప్రతి మాటను, బలహీనతలను, భవిష్యత్తు ప్రణాళికలను ఇతరుల ముందు విప్పితే, కొందరు దాన్ని తమ స్వార్థం కోసం వాడుకునే ప్రమాదం ఉంది. ఎదుటి వ్యక్తి ఎలాంటివారో సరిగ్గా అంచనా వేయకుండా ప్రతి ఒక్కరినీ వెంటనే నమ్మేయడం వల్ల మానసిక ఆందోళనలు, సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది.

వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు..

ఆచార చాణక్యుడి బోధనల ప్రకారం, నిజాయితీగా ఉండటం అంటే మన జీవితంలోని ప్రతి చిన్న రహస్యాన్ని అందరికీ పంచేయడం కాదు. నిజాయితీ అనేది మన వ్యక్తిగత ప్రవర్తనలో, పనుల్లో ఉండాలి తప్ప మన బలహీనతలను అందరికీ బహిర్గతం చేసేలా ఉండకూడదు. ఎవరైతే తమ వ్యక్తిగత విషయాలను, రహస్యాలను ఇతరుల ముందు సులభంగా బయటపెడతారో, వారు తరచూ ఇబ్బందుల్లో పడుతుంటారు. ముఖ్యంగా మన భవిష్యత్తు లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు వంటి చాలా కీలకమైన అంశాలను ఎవరితో పంచుకుంటున్నామో చాలా జాగ్రత్తగా గమనించాలి.

పరిశీలన ముఖ్యం..

ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు వారి ప్రవర్తనను, ఆలోధనా విధానాన్ని కొంతకాలం గమనించడం ఎప్పుడూ మేలు చేస్తుంది. అందరి ముందూ తమ మంచితనాన్ని గొప్పగా చాటుకోవాలని ప్రయత్నించే వారు తరచూ ఇతరుల మోసాలకు బలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఆచరణాత్మకమైన తెలివితేవిలతో మెలగడం చాలా అవసరం. ఎవరితో ఎంత దూరం ఉండాలి, ఏ విషయాలు ఎవరితో మాట్లాడాలి అనే విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా, సురక్షితంగా సాగుతుంది. కాబట్టి, మంచితనాన్ని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో, దాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలనే వివేకం ఉండటం కూడా అంతే ముఖ్యం.

                                                                                                                                            *రూపశ్రీ.