డెంగీ జ్వరంలో ప్లేట్ లెట్స్ ఎందుకు తగ్గుతాయి?

వర్షాకాలంలో దోమలు విజృంభించడం వల్ల  వచ్చే జ్వరాలలో డెంగీ ఒకటి. ఇది చాలా ప్రమాదకరమైనది. సరైన ట్రీట్మెంట్ లేకపోవడం డెంగీ జ్వరాన్ని ప్రాణాంతకంగా మారుస్తుంది. డెంగీ వచ్చినవారిలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోతుందనే విషయం  అందరూ వినే ఉంటారు. ఇలా ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం  మరణానికి తలుపులు తెరవడమే.. అసలు ఈ ప్లేట్ లెట్స్ ఎందుకు తగ్గిపోతాయి? దీనికి  కారణం ఏంటి? ప్లేట్ లెట్స్ పెంచడానికి ఏం చేయాలి? మొదలైన విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్లేట్ లెట్స్  ఎంత ఉండాలి?

ప్లేట్‌లెట్స్, లేదా థ్రోంబోసైట్‌లు, మన రక్తంలోని  రంగులేని, చిన్న  కణ శకలాలు. ఇవి గాయం తగిలినప్పుడు రక్తస్రావం అయ్యేటప్పుడు రక్తం గడ్డ  కట్టేలా చేస్తాయి. ఈ కారణంగా రక్తస్రావాన్ని ఆపుతాయి. ఈ ప్లేట్ లెట్స్  ఎముక మజ్జలో  తయారవుతాయి. ఆరోగ్యకరమైన వ్యక్తిలో ప్లేట్‌లెట్ కౌంట్ మైక్రోలీటర్ రక్తంలో 1,50,000 నుండి 4,50,000  వరకు ఉంటుంది. 450,000 కంటే ఎక్కువ ప్లేట్‌లెట్‌లను కలిగి ఉండటాన్ని థ్రోంబోసైటోసిస్ అని,  150,000 కంటే తక్కువ ప్లేట్‌లెట్లను థ్రోంబోసైటోపెనియా అని పిలుస్తారు. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి థ్రోంబోసైటోపెనియా అనే సమస్య  శరీరంలో ఏర్పడుతుంది.

ప్లేట్ లెట్స్ తగ్గడానికి ఇదే కారణం..

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.

మన ఎముక మజ్జ అణచివేయబడుతుంది, ఫలితంగా ప్లేట్‌లెట్ ఉత్పత్తి తగ్గుతుంది.

డెంగ్యూ వైరస్ బారిన పడిన రక్తకణాలు ప్లేట్‌లెట్లను దెబ్బతీసి వాటిని నాశనం చేయడం ప్రారంభిస్తాయి.

డెంగీ జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఏర్పడే  యాంటీబాడీల వల్ల ప్లేట్‌లెట్స్ కూడా తగ్గడం ప్రారంభిస్తాయి.

ప్లేట్ లెట్స్ తగ్గితే శరీరంలో జరిగేది ఇదే..

డెంగ్యూ వ్యాధి వచ్చిన 3వ-4వ రోజు వరకు ప్లేట్‌లెట్ కౌంట్ సాధారణంగా తక్కువగా ఉంటుంది.  ఆ తరువాత జరిగే ట్రీట్మెంట్ వల్ల ఎనిమిది నుండి తొమ్మిదవ రోజులో మెరుగుదల  ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి డెంగ్యూ  జ్వరం వచ్చినప్పుడు మొదటి  8రోజులు చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో ప్రమాదం జరగకుండా కాపాడుకోవాలి.  ప్లేట్‌లెట్స్ రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి కాబట్టి, శరీరంలో వాటి లోపం వల్ల డెంగ్యూ కేసుల్లో రక్తపు వాంతులు లేదా రక్తపు మలం జరుగుతుంది.

ప్లేట్‌లెట్స్  ఎలా పెంచుకోవాలి?

డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్స్ తగ్గడం తీవ్రమైన వ్యాధికి సంకేతం. రోగిని ఆసుపత్రిలో చేర్చాలి, తద్వారా ఇతర లక్షణాలతో పాటు రక్తస్రావం సమస్యను నియంత్రించవచ్చు. వైద్యులు దానిని మందుల ద్వారా మెరుగుపరుస్తారు. ఇది కాకుండా, ఒమేగా -3, విటమిన్లు, ఐరన్ మరియు ఇతర మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడతాయి, డెంగ్యూలో ప్లేట్‌లెట్ల సంఖ్యను కూడా పెంచుతాయి. డెంగ్యూ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ద్రవపదార్థాలు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

  *నిశ్సబ్ద.