పొట్టి క్రికెట్ లో 2 వేల సిక్సర్లు: విండీస్ వరల్డ్ రికార్డ్.!
Published on: Mon Oct 12, 2026 1:03PM

అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో విండీస్ జట్టు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. పొట్టి క్రికెట్ లో 2 వేల సిక్సర్లు బాదిన జట్టుగా విండీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. టీమ్ ఇండియాతో ఐదు టి20ల సిరీస్ లో భాగంగా ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో విండీస్ ఈ రికార్డు సృష్టించింది.
పొట్టి ఫార్మాట్‌లో రెండు వేల సిక్సర్ల మార్క్‌ను అందుకున్నతొలి జట్టుగా అరుదైన మైలు రాయి చేరుకుంది. దశాబ్దాలుగా విధ్వంసకర బ్యాటింగ్‌కు, పవర్ హిట్టింగ్‌కు మారుపేరుగా నిలిచిన వెస్టిండీస్ ఆటగాళ్లు, ఈ ఘనత సాధించడం ద్వారా మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
ఇండోర్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు వెస్టిండీస్ జట్టు 1,997 సిక్సర్లతో రెండు వేల మార్కుకు సమీపంలో నిలిచింది. ఇక ఇండోర్ మ్యాచ్ లో విండీస్ ఆటగాళ్లు 13 భారీ సిక్సర్లు బాదారు. దీంతో ఆ జట్టు సిక్సర్ల సంఖ్య రెండు వేలు దాటిపోయింది. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్ వంటి దిగ్గజ పవర్ హిట్టర్లు గతంలో వేసిన పునాదికి, ప్రస్తుత తరం యువ ఆటగాళ్లు అందిస్తున్నదూకుడు తోడ వడంతో ఈ రికార్డు సాధ్యమైంది.

అయితే, ఈ సిక్సర్ల రేసులో టీమిండియా వెస్టిండీస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఇండోర్ మ్యాచ్ ముగిసే సమయానికి భారత జట్టు 1,997 సిక్సర్లతో విండీస్ తరువాత రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ రేసులో విండీస్, ఇండియా తరువాత 1585 సిక్సర్లతో కివీస్ మూడో స్థానంలో ఉంది.
[West Indies T20 Sixes Record, 2000 Sixes, T20 Format, India VS West Indies, World Record, Telugu One]


