TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కంటోన్మెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!

Published on: Tue Sep 1, 2026 4:52PM

 

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో  అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది. ఆయుధాలు భద్రపరిచిన గది తలుపు లను బద్దలుకొట్టి దుండ గులు లోపలికి ప్రవేశించి తుపాకులు, మందు గుండు సామగ్రిని ఎత్తుకెళ్లి నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీకి గురైన వాటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, పిస్టల్స్, ఇన్సాస్ రైఫిల్‌తో పాటు మందు గుండు సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయుధాల చోరీపై ఆర్మీ అధికారులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రక్షణ వ్యవహారం కావడంతో పోలీసులు దర్యాప్తుకు సంబంధించిన పూర్తి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. 

ఆయుధాలు ఉన్న ప్రాంతానికి సాధారణ వ్యక్తులు లేదా కొత్త వ్యక్తులు ప్రవేశించే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో దర్యాప్తు అధికారులు అంతర్గత వ్యక్తుల పాత్రపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆయు ధాల భద్రత కోసం విధుల్లో ఉన్న 12 మంది సెక్యూరిటీ గార్డులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన సమయంలో విధుల్లో ఎవరెవరు ఉన్నారు? ఆయుధాల గదికి ఎవరె వరు వెళ్లారు? తలుపులు ఎప్పుడు తెరవబడ్డాయి? తాళాలు ఎలా బద్దల య్యాయి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తు న్నారు. చోరీ జరిగిన ప్రాంతానికి బయట వ్యక్తులు కొత్తగా వచ్చినట్లు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో భద్రతా విధుల్లో ఉన్న సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 ఈ నేపథ్యంలోనే ఆర్మీ గార్డుల్లో ఎవరికైనా చోరీతో సంబంధం ఉందా? అన్న కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఆయుధాల గది పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు, ఆర్మీ అధికారులు పరిశీలిస్తున్నారు. చోరీకి ముందు, తరువాత బ్యారక్ పరిసరాల్లో సంచరించిన వ్యక్తుల కదలికలను విశ్లేషిస్తు న్నారు. ఆయుధాలు బరువుగా ఉండటంతో ఒకరి కంటే ఎక్కువ మంది ఈ చోరీలో పాల్గొని ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. కంటోన్మెంట్ వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలోనే ఆయుధాలు చోరీకి గురికావడం తీవ్ర భద్రతా వైఫల్యంగా చర్చకు దారితీసింది. చోరీకి గురైన ఆయుధాలు, మందు గుండు సామగ్రిని త్వరగా స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు కొనసాగించారు.

 

Weapons theft case in Cantonment, AK-47 Rifles, Army guard, INSAS rifle, Security guard, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telugu one, Telugu news