TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ స్ఫూర్తితోనే ఆత్మీయ పలకరింపు.. నారా లోకేష్

Published on: Sat Feb 14, 2026 1:38PM

బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేతల కుటుంబాలతో తన నివాసంలో చేపట్టిన ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి మోడీ యే స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం (ఫిబ్రవరి 14) అసెంబ్లీ ఆవరణలో నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఎంత బిజీగా ఉన్నా  ప్రజాప్రతినిథులు నిత్యం  ప్రజలలో ఉండాలన్నదే తన అభిప్రాయమన్నారు. రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత ముఖ్యమో, నేతలతో ఆత్మీయ పలకరింపు కూడా అంతే ముఖ్యమన్న లోకేష్ అంతటితో ఆగకుండా.. ఏఐ క్వాంటం ఎంత అవసరమో మనవీయ సంబంధాలూ అంతే అవసరమని చెప్పారు. కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలని చెప్పారు.  క్వాంటం, ఏఐలు సీఎం చంద్రబాబు చూసుకుంటారనీ, తాను మానవీయ సంబంధాలు చూసుకుంటానన్నారు.

అందుకే బడ్జెట్ సమావేశాలప్పుడైనా ఇలా నేతలందరితో ఏటా కలిసేలా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. ఇంక తాను బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ.. మరో రెండు కిలోల బరువు తగ్గితే తాను లక్ష్యం చేరుకుంటానని చెప్పారు. ఇక సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమన్నది తనకు ప్రతిపక్షంలో ఉండగా అలవాటైందన్నారు. ఏ అంశంపైనైనా పార్టీ నిర్ణయం తీసుకునే వరకూ అభిప్రాయాలు బలంగా వినిపించవచ్చన్న లోకేష్.. ఒక సారి పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడాల్సిందేనన్నారు. ఈనెల 28న యలమంచిలిలో బ్లూజెట్ పరిశ్రమ శంకుస్థాపనపై మాట్లాడుతూ,  ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి 2,300 కోట్ల రూపాయల పెట్టుబడి రానుందన్నారు.