TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాణి రుద్రమ, కొమురం భీం: తెలంగాణలో కొత్త విమానాశ్రాయాల పేర్లు.!

Published on: Thu Sep 24, 2026 10:09AM

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు కానున్న  విమానాశ్రయాల పేర్లను  రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వరంగల్ లోని మామునూరు విమానాశ్రయం,  ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు   చారిత్రక ప్రముఖుల పేర్లను పెట్టాలని నిర్ణయించింది. వీరనారి కాకతీయ రాణి రుద్రమదేవి, ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం పేర్లను  ఈ రెండు విమానాశ్రయాలకు ఖరారు చేసింది.

ఇందుకు త్వరలోనే రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసి అధికారికంగా ఈ పేర్లను ప్రకటించనుంది. చారిత్రక  నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ రెండు విమానాశ్రయాల ద్వారా ఆయా ప్రాంతాల సాంస్కృతిక విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

వరంగల్ విమానాశ్రయానికి రాణిరుద్రమ పేరునూ, ఆదిలాబాద్ విమానాశ్రయానికి కొమురుం భీం పేరుపై  ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.  దేశంలోని వివిధ ప్రాంతాలలో కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయాలకు ఆయా రాష్ట్రాల ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు,  చారిత్రక నాయకుల పేర్లు పెడుతున్న పద్ధతిని తెలంగాణ కూడా అనుసరిస్తోంది.

 తెలంగాణ నేల అందించిన పోరాట స్ఫూర్తిని,  చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు తెలియజెప్పేలా ఈ పేర్ల  ఎంపిక జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పేర్లను రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో లాంఛనంగా ఆమోదించిన వెంటనే  ప్రతిపాదనలను అధికారికంగా కేంద్రానికీ,  పౌర విమానయాన శాఖకు పంపనున్నారు. కేంద్రం   గ్రీన్ సిగ్నల్ రాగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.  

[Warangal Airport, Adilabad Airport, Rani Rudrama Devi, Komaram Bheem, Revanth Reddy, Telangana Airports Names, Telangana News, Telugu One]