ఇరాన్ తో యుద్ధం ఇప్పుడే ఆగదు.. చర్చలకు నో.. ట్రంపరి వ్యాఖ్యలు.!
Published on: Thu Sep 10, 2026 7:54AM
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగదంటూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగబోయే అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసేంత వరకూ ఇరాన్ తో యుద్ధం సాగుతుందన్నారు. డల్లాస్‌లో జరగనున్న రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి బయలుదేరే ముందు వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ దేశంలో రాజకీయ అధికారంలో మార్పు వస్తుందనే ఆశతో ఇరానే ఈ యుద్ధాన్ని సాగదీస్తోందని ఆరోపించారు.
అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించిన ట్రంప్.. అమెరికా ఓటర్లను భయాందోళనలకు గురి చేసి దేశంలో ఒక బలహీనమైన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇరాన్ వ్యవహరిస్తోందన్నారు. అమెరికాలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే.. తాము సులువుగా అణ్వాయుధాలు సమకూర్చుకోవచ్చన్నది ఇరాన్ ఉద్దేశమన్న ట్రంప్.. ఆ దేశం వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉంటే మొత్తం ప్రపంచానికే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఆ పరిస్థితిని తాను రానివ్వనని ట్రంప్ చెప్పారు.

పరిస్థితి ఇంత వరకూ వచ్చిన తరువాత ఇక ఇరాన్ తో చర్చల ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టిన ట్రంప్.. ఒకప్పుడు తాము ఒప్పందానికి సిద్ధపడ్డామని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో చర్చలు జరిగినా, అది అణు ఒప్పందానికి మాత్రమే పరిమితం కాకుండా, గతంలో ఎన్నడూ లేని అనేక కఠిన నిబంధనలను ఇరాన్ ముందు ఉంచుతామన్నారు.
ఇదలాఉండగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా దళాల దాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్‌కు చెందిన చమురు రవాణా నౌకలు, ఇంధన నెట్‌వర్క్‌లు లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ట్రంప్ ధృవీకరించారు. గల్ఫ్ జలాల్లో ఇరాన్‌కు చెందిన దాదాపు తొమ్మిది చమురు ట్యాంకర్లను అమెరికా సైన్యం ధ్వంసం చేసిందన్నారు. ఈ దాడులు రానున్న రోజుల్లో మరింత ఉధృతమౌతాయని హెచ్చరించారు.
[War With Iran Wont End Now, Donald Trump, Iran War, US Midterm Elections, US Iran Tensions, Telugu One]


