TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు.!

Published on: Fri Oct 2, 2026 10:40AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీ సులు జారీ చేసింది. అక్టోబర్ 14న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హత్య కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌, ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. వివేకా హత్యకు సంబంధించిన ఆర్థిక వ్యవహా రాలపై దృష్టి పెట్టిన ఈడీ ఇప్పటికే కేసులోని పలువురు నిందితులను విచారించింది. సెప్టెంబర్ 25న సునీల్ యాదవ్‌ను, సెప్టెంబర్ 29న ఉమా శంకర్ రెడ్డి,ఎర్ర గంగిరెడ్డి లను ఈడీ ప్రశ్నించింది. షేక్ దస్తగిరిని కూడా అధికారులు విచారించారు. దస్తగిరి ఈ కేసులో అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి రూ.40 కోట్ల డీల్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ ఆరోపణల ప్రకారం హత్యకు సంబం ధించి రూ.40 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం జరిగినట్లు దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. 

షేక్ దస్తగిరికి రూ.1 కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారన్న ఆరోపణ కూడా దర్యాప్తులో ఉంది. 2019 నుంచి నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, నగదు లావా దేవీలు, నిధుల కదలికలను ఈడీ పరిశీలిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఆగస్టు 21న హైదరాబాద్‌, కడపలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిం చింది. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, డి.శివశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరికి సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. అవినాష్ రెడ్డికి సంబంధించిన ప్రాంగణం నుంచి రూ.24 లక్షల లెక్కల్లో చూపని నగదు, రెండు బ్యాంకు లాకర్ తాళాలతో పాటు పలు పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వివేకానందరెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. 

ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు కొనసా గించింది. సీబీఐ ఎఫ్‌ఐ ఆర్‌, చార్జిషీట్లలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేసి ఆర్థిక కోణంలో దర్యాప్తు చేస్తోంది. సీబీఐ దర్యాప్తు ప్రధానంగా హత్య, కుట్ర, ఆధారాల ధ్వంసానికి సంబంధించిన అంశాలపై ఉండగా.. ఈడీ దృష్టి నిధుల మూలం, చెల్లిం పులు, బ్యాంకు లావా దేవీలు, మనీ ట్రైల్‌పై ఉంది.సీబీఐ 2023లో అవినాష్ రెడ్డిని కేసులో నిందితుడిగా పేర్కొంది. అయితే ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, తాను మరియు తన కుటుంబాన్ని తప్పుడు ఆరోపణలతో ఇరికించారని గతంలో పేర్కొన్నారు. తాజాగా అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడంతో అక్టోబర్ 14న జరిగే విచారణపై ఆసక్తి నెలకొంది. ఈడీ దర్యాప్తు లో వెలుగులోకి వచ్చిన ఆర్థిక లావా దేవీలు, రూ.40 కోట్లుగా పేర్కొం టున్న మనీ ట్రైల్‌, ఇతర నిందితుల వాంగ్మూలాలపై ఎంపీని ప్రశ్నించే అవకాశం ఉంది.

 

 

 

[ Viveka Murder Case, ED notices to MP Avinash Reddy, Uma Shankar Reddy, Erra Gangi Reddy, Sunil Yadav, Sheikh Dastagiri,CBI, Chargesheets, YS Bhaskar Reddy, Telugu One, Telugu News ]