TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

400 కోట్ల రూపాయలతో వైజాగ్ బ్యూటిఫికేషన్: మారనున్న సాగర నగరం రూపురేకలు.!

Published on: Thu Oct 1, 2026 4:39PM

సాగర నగరం విశాఖ పట్నం రూపురేకలు మారే విధంగా నాలుగు వందల కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేపట్టారు. విశాఖ వేదికగా వచ్చే నెలలో జరగనున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు కోసం నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయనున్నారు. ఈ సుందరీకరణలో బాగంగా   నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, సెంట్రల్ మీడియన్లు,  డివైడర్ల ఆధునీకరణకు   ప్రాధాన్యత ఇస్తున్నారు.  దుత్ ఐలాండ్ జంక్షన్ నుంచి సిరిపురం పోలమాంబ అమ్మవారి ఆలయం వరకు ఉన్న ప్రధాన మార్గాల్లో జరుగుతున్న సెంట్రల్ మీడియన్ అభివృద్ధి పనులను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్  కమిషనర్ కేతన్ గర్గ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణ రాజుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, పనుల పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు   స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అలాగే రోడ్ల విస్తరణ, పచ్చదనం పెంపు, ఆధునిక లైటింగ్ ఏర్పాట్లు, కూడళ్ల సుందరీకరణ పనులు వేగవంతంచేయాలని. ప్రధాన రహదారులపై రాకపోకలు సాగించేవారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నూతన డిజైన్లతో కూడిన విద్యుత్ దీపాలు, ఆకర్షణీయమైన బస్ బేలను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ప్రతినిధులు,  ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాల్లో ఎటువంటి రాజీ కూడదని  అధికారులను హెచ్చరించారు.

అంతర్జాతీయ స్థాయి సదస్సుకు గట్టిగా నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో..   పనుల్లో వేగం పెంచి నిర్ధిష్ట సమయానికి పూర్తి చేయాలనిఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు పనుల పురోగతిని రోజు వారీ సమీక్షించి జాప్యానికి తావులేకుండా చూడాలని ఆదేశించారు.  

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి కేంద్ర బిందువుగా మారిన విశాఖపట్నంలో ఈ తరహా అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విదేశాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులకు నగరం పట్ల ప్రత్యేక మక్కువ కలిగేలా సుందరీకరణ పనులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.  పర్యాటకంగా,   వాణిజ్యపరంగా  విశాఖకు ఉన్న ప్రత్యేకతను   ఇనుమడింపజేసేందుకు ఈ సుందరీకరణ దోహదపడుతుందంటున్నారు. 

  మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా ఈ పనులు సాగుతున్నాయి. పర్యావరణ హిత విధానాలకు ప్రాధాన్యత ఇస్తూ.. రోడ్ల వెంట పచ్చదనం పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే ఈ సుందరీకరణ, అభివృద్ధి పనుల్లో ప్రా భాగస్వామ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు.  

[Visakhapatnam beautification, CII Partnership Summit Vizag, RS400crores Butification, GVMC Development, Special Package CII Summit, Telugu One]