కాశ్మీర్ తొలి ఫిలిం ఫెస్టివల్‌లో వర్చువల్ భారత్ డాక్యుమెంటరీల హవా!
Published on: Sat Sep 5, 2026 11:37AM
.webp)
భారతదేశ మూలాల్లో దాగున్న అపురూప కథలను, మన సాంప్రదాయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా ప్రముఖ దర్శకుడు భారత్‌బాలా రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'వర్చువల్ భారత్'. దేశంలోని దాగి ఉన్న 1,000 విభిన్న సాంస్కృతిక కథలను 10 నిమిషాల వ్యవధి గల షార్ట్ డాక్యుమెంటరీల రూపంలో డిజిటల్ భద్రపరచడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. 2019 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ బృహత్తర యజ్ఞంలో భాగంగా రూపొందిన మూడు విశిష్ట డాక్యుమెంటరీలు ఇప్పుడు ఒక అరుదైన చారిత్రక ఘట్టంలో భాగమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో తొలిసారిగా నిర్వహిస్తున్న 'ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ (IFFJK) 2026'లో ప్రదర్శనకు ఈ మూడు చిత్రాలు ఎంపికై సంచలనం సృష్టిస్తున్నాయి.
'రంగ్-యే-సినిమా' (Rang-e-Cinema) అనే ప్రత్యేక ఇతివృత్తంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 నుండి 10 వరకు శ్రీనగర్, జమ్మూ, గుల్మార్గ్ లలో అత్యంత వైభవంగా ఈ ఫెస్టివల్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల నుండి వచ్చిన 1,100కి పైగా ఎంట్రీలలో తీవ్ర పోటీ నెలకొనగా, చివరికి 41 దేశాలకు చెందిన కేవలం 135 చిత్రాలు మాత్రమే ఈ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై 'వర్చువల్ భారత్' సిరీస్ నుండి మూడు చిత్రాలు చోటు దక్కించుకోవడం భారతీయ స్వదేశీ కళాకారులకు దక్కిన గొప్ప గౌరవంగా నిలిచింది.
ఈ సిరీస్ లోని 'నఖ్ష్-యే-దౌర్: ది స్టోరీ ఆఫ్ గులామ్ నబీ దార్' (Naqsh-e-Daur: The Story of Ghulam Nabi Dar) మరియు 'తాలీమ్' (Taleem) అనే రెండు చిత్రాలు జేఅండ్ కే సెలెక్ట్ కాంపిటీషన్ విభాగంలో పోటీపడుతుండగా, 'కునేమెచి: ఏ హోమ్ కార్వ్‌డ్ ఇన్ యాన్సెస్ట్రీ' (Kunemechi: A Home Carved in Ancestry) అనే మూడో డాక్యుమెంటరీ నాన్-కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శించబడుతోంది. 'నఖ్ష్-యే-దౌర్' చిత్రం శ్రీనగర్ సఫాకదల్ ప్రాంతానికి చెందిన సీనియర్ శిల్పి గులామ్ నబీ దార్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. తన గురువు నూర్ దిన్ తికో వద్ద శిక్షణ పొంది, సుమారు 6 దశాబ్దాలుగా (60 ఏళ్ళు) కాశ్మీరీ అక్రోట్ (వాల్‌నట్) చెక్కపై ప్రాచీన కాశ్మీర్ చరిత్రను, సాంప్రదాయ చినార్ రేఖలను, ఖురాన్ కాలిగ్రఫీని అత్యంత నైపుణ్యంతో చెక్కుతూ ఆయన ఈ కళను జీవిస్తున్నారు. ఆధునీకరణ మరియు ఆ ప్రాంతంలోని సంక్షోభాల మధ్య కూడా ఈ కళ నశించిపోకుండా యువ కళాకారులకు శిక్షణ ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఆయన పట్టుదలను ఈ చిత్రం ఆవిష్కరించింది.
iffjk 2026 virtual bharat 3 short films selected,bharatbala virtual bharat kashmir international film festival.


