2027 వరల్డ్ కప్ టీమ్ లో రోకో: బీసీసీఐ కండీషన్లివే.!
Published on: Tue Oct 13, 2026 2:24PM
.webp)
2027 వరల్డ్ కప్ జట్టులో రో హిట్ శర్మ, కింగ్ కోహ్లీలకు చోటు విషయంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఏ ఆటగాడైనా జట్టులో స్థానం సంపాదించాలంటే అందుకు కొలమానం అతడి ఫిట్ నెస్, ఫామ్ (ప్రదర్శన) మాత్రమేనని స్పష్టం చేసింది. ఆటగాళ్ల వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేననీ, జట్టులో ఎంపిక విషయంలో వయస్సు పైబడిందన్నవిషయాన్ని ప్రామాణికంగా తీసుకోబోమనీ చెప్పింది. అంటే మొత్తంగా రోకో జట్టులో ఉండాలంటే.. అది వారి ఫిట్ నెస్, ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుందని కుండ బద్దలు కొట్టింది.
2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, భారత జట్టు కూర్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొత్తంగా ఆయన చెప్పిన విషయం ఏమిటంటే వచ్చే వరల్డ్ కప్ లో రోకో ఉంటారా లేదా అన్నది వారి ఫిట్ నెస్, ఫామ్ ఆధారంగానే తేలుతుంది. అంటే కోహ్లీ, రోహిత్‌లకు ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయమని కానీ, చోటు లేదనీ కానీ ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల విండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో కోహ్లీ, రోహిత్ మంచి ఫామ్ కనబరిచారు. పరుగుల వరద పారించారు. ఒక మ్యాచ్ లో కోహ్లీ అజేయంగా 139 పరుగులు చేశాడు. అలాగే రోహిత్ శర్మ కూడా ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీ సాధించాడు.

ఇరువురూ కూడా తమ ఫిట్ నెస్ ను, ఫామ్ ను నిరూపించుకున్నారు. ఈ ప్రదర్శనలు వారి అనుభవాన్ని, వారిలో పరుగులు చేయగలిగిన ఎబిలిటీనీ మరో సారి చాటాయి. ఇక మొత్తంగా కోహ్లీ, రోహిత్ శర్మలకు ప్రపంచ కప్ లో బెర్త్ లు ఖాయమయ్యాయా అంటే ఔననీ, లేదనీ చెప్పలేని పరిస్థితి ఉందన్నది మిథున్ మన్హాస్ మాటల సారాంశం.
[Virat Kohli, Rohit Sharma Selection In 2027 World Cup, BCCI Comments, Team India World Cup Squad, ROKO Fitness, Form, Telugu One]


