TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విండీస్ తో తొలి వన్డే: విరాటుడి రికార్డుల మోత.!

Published on: Mon Sep 28, 2026 10:48AM

వెస్టిండీస్‌తో  రెండు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 27) జరిగిన తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా సునాయాస విజయం సాధించింది. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగి 139  పరుగులతో నాటౌట్ గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకంగా నిలిచాడు.  విరాటుడి అద్భుత బ్యాటింగ్ విన్యాసాలను క్రికెట్ ప్రపంచం అబ్బురంగా తిలకించింది. విండీస్ నిర్దేశించిన 296 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్ ఇండియా   41.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి    ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 108 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 110 పరుగులు చేసి రాణించాడు, అయితే  విరాట్ కోహ్లీ  బ్యాటింగ్ మాత్రం ఈ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.   88 బంతుల్లో 10 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో అజేయంగా 139 పరుగులు సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లూ కలిపి కోహ్లీకి ఇది 86వ సెంచరీ.  

ఈ మ్యా్ లో విరాట్ కోహ్లీ   వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 1 వేల 0 పరుగులు పూర్తి చేసిన  బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్  సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్  రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. విరాట్   303 ఇన్నింగ్స్‌ల్లోనే  ఈ   మైలురాయిని చేరుకోగా, సచిన్  ఇందుకు 377 ఇన్నింగ్స్‌   తీసుకున్నాడు. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 15 వేల పరుగులు మార్క్‌ను దాటిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో తొలిస్థానంలో సచిన్ టెండూల్కర్ 4 18,426 పరుగులతో ఉన్నాడు.  

 స్వదేశంలో జరిగిన వన్డే మ్యాచుల్లో ఏకంగా 7,000 పరుగులు పూర్తి చేసుకున్న ప్రపంచంలోని మొట్టమొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డ్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు.  . ప్రస్తుతం హోమ్ వన్డేల్లో కోహ్లీ ఖాతాలో మొత్తం 7,006 పరుగులు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఇండియాలో 6,976 వన్డే పరుగులు చేశారు. అలాగే, భారత గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ . దీని ద్వారా స్వదేశంలో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్  రికార్డును కోహ్లీ సమం చేశాడు.

వెస్టిండీస్‌పై కోహ్లీకి ఇది 10వ వన్డే సెంచరీ.  గతంలో శ్రీలంకపై కూడా విరాట్ 10 సెంచరీలు సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధికంగా 10 సెంచరీలు బాదిన ఏకైక  బ్యాట్స్ మన్ గా విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇక   వన్డేల్లో లక్ష్య ఛేదనలో  జట్టును అత్యధిక సార్లు విజయతీరాలకు చేర్చిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 112 విజయాలతో ఆస్ట్రేలియా బ్యాటర్ రికీ   పాంటింగ్  111 విజయాను అధిగమించాడు. కోహ్లీ తన వన్డే కెరీర్ లో ఒకే మ్యాచ్ లో 9 సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.   


[Virat Kohli, ODI Century, West Indies Match, Sachin record, Records, King Kohli, Telugu One]