రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ: మరో ప్రపంచ రికార్డ్.. ఏంటో తెలుసా.?
Published on: Wed Nov 4, 2026 1:11PM

క్రికెట్ చరిత్రలో టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించి తన పేరున కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో నంబర్-3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 13,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని అధిగమించాడు.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నంబర్-3 స్థానంలో 13 వేల పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి కోహ్లీకి 12 పరుగులు అవసరం కాగా, మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చిన తర్వాత తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. కోహ్లీ, ఇన్నింగ్స్‌లోని 13వ బంతికి సింగిల్ తీసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ నుంచి దాదాపు దశాబ్దన్నర కాలంగా భారత జట్టు తరఫున నంబర్-3 స్థానంలో స్థిరంగా బ్యాటింగ్ చేస్తూ వస్తున్న కోహ్లీ, ఈ పొజిషన్‌లో అసాధారణ సగటుతో పరుగులు సాధిస్తూ ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంగా నిలిచాడు..
కోహ్లీ కేవలం 251 ఇన్నింగ్స్‌లోనే నంబర్-3 స్థానంలో 13,000 పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం.
క్రికెట్ లెజెండ్స్ సరసన తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్న కోహ్లీ సాధించిన ఈ అరుదైన ఘనత పట్ల దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
[Virat Kohli Another World Record, 13000 ODI runs, Number 3, ODI cricket records, Sports News, TeluguOne]


