వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి.!
Published on: Sun Nov 22, 2026 10:28AM
.webp)
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా.. ఆటో డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ మండలం పెండ్లిమడుగు నుంచి కేరెల్లి వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో.. బుగ్గ రామేశ్వరం సమీపంలోని ఓ మలుపు వద్దకు చేరుకోగానే లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలతో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను ఆటో డ్రైవర్ నాగేష్తో పాటు చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.!
మీకు నచ్చవచ్చు: హెచ్సీయూ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్: 40 మందికి అస్వస్థత.!
[ Vikarabad Road Accident, Vikarabad Accident, Auto Lorry Collision, Four Dead, Fatal Road Accident, Bugga Rameshwaram, Pendlimadugu, Kerelli, Telangana News, Road Accident ]


