TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవాడ మేయర్ గా వంగవీటి రాధా ఘన విజయం: మూడో స్థానానికే పరిమితమైన ఏబీవీ.!

Published on: Wed Nov 4, 2026 10:58AM

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన  వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు.  హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అశ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై  లక్షా 35 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు.  ఎన్నిక ఫలితం వెలువడిన రోజే ఆయన జన్మదినం కూడా కావడం విశేషం. వంగవీటి రాధా విజయాన్ని తెలుగుదేశం కూటమి శ్రేణులు, వంగవీటి రాధా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. సంబరాలు జరుపుకున్నారు.  
ఈ ఎన్నికల్లో కూటమి తరఫున బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణకు 2,65,888 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి రాయన భాగ్య లక్ష్మికి వచ్చిన ఓట్లు ఆయన మెజారిటీకి దాదాపు సమానం అంటే ఆయన విజయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  మరోవైపు, కాంగ్రెస్ మరియు వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు   12 వేల 642 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. 

విజయవాడ రాజకీయాల్లో దశాబ్దాలుగా నలుగుతున్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో, ఏబీ వెంకటేశ్వరరావు బరిలో నిలవడంతో మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఆయన బరిలో నిలవడంతో  గెలుపు, ఓటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వంగవీటి రాధా విజయావకాశాలను ఏబీవీ పోటీ దెబ్బతీస్తుందన్న విశ్లేషణలూ వెలువడ్డాయి.  మాజీ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం, ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజలలో మంచి పలుకుబడి ఉన్నప్పటికీ ఏబీవీని పొలిటికల్ లీడర్ గా చూసేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపలేదని ఫలితాన్ని బట్టి అవగతమౌతోంది.   

[Vijayawada Mayor Vangaveeti Radha, AP Municipal Elections, AB Venkateswara Rao, YCP Rayana Bhagyalakshmi, TeluguOne AP Political News, Telugu One]