TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంద్రకీలాద్రి: దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.!

Published on: Wed Sep 30, 2026 2:22PM

 విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు జరగనున్న దసరా మహోత్సవాలకు హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతూ.. క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం చంద్రబాబుకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి వేదాశీర్వచనం చేశారు. అనంతరం దసరా మహోత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. భక్తుల దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.

 

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు.. రద్దీ నియంత్రణ, భద్రతా చర్యలను ముందస్తుగా పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.సీఎంను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించిన వారిలో దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈఓ శీనా నాయక్‌తో పాటు పాలక మండలి సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా దసరా మహోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన పలు అంశాలను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

 

 

 

[ Vijayawada Dasara, Durgamma Dasara, Indrakeeladri, Kanaka Durga Temple, Chandrababu Naidu, AP CM Chandrababu, Dasara Celebrations, Dussehra Festival, Durga Temple, Vijayawada, Dasara Mahotsavam, Andhra Pradesh, Temple Arrangements, Devotees, Borra Radhakrishna, Endowments Department ]