TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయసాయి కొత్త పార్టీ ప్రకటన.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?

Published on: Mon Aug 24, 2026 4:33PM

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ప్రకటించేశారు. శ్రావణ శుక్రవారం రోజే తాను విజయవాడ వేదికగా కొత్తపార్టీ ప్రకటన చేస్తానని వెల్లడించారు.  తాను త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే వెల్లడించిన విజయసాయి. ఇప్పుడు ఆ పార్టీ ప్రకటన ఎప్పుడు, ఎక్కడ అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు.  

 శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు  విజయవాడ వేదికగా  పార్టీ పేరు, జెండా, అజెండా, విధివిధానాలను వెల్లడిస్తానని చెప్పారు.  ప్రజాసమస్యలపై నిలదీసేందుకు,  ప్రజల గొంతుకగా మారేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ ను తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు.  

గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి రాజకీయ అడుగులపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది.  వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించిన ఇంత కాలానికి సొంత రాజకీయ వేదక ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం విశేషం.   

Vijayasai Reddy Political Party Announcement, Vijayawada, Sravana Sukrvaram, Vijayawada,   AP Politics, TeluguOne