చంద్రబాబుపై ఉపరాష్ట్రపతి ప్రశంసల వర్షం.. ఏ విషయంలోనో తెలుసా?
Published on: Mon Aug 24, 2026 2:57PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనా దక్షత, దార్శనికతపై ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తాజాగా ప్రశంసలు గుప్పించారు. చంద్రబాబును ఆయన నిజమైన జాతీయవాదిగా ప్రశంసించారు. ఏలూరు జిల్లా ముసునూరులో నిర్వహించిన నాన్-జీఎంఓ హై ఎక్స్‌పాన్షన్ పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత ఏ విధంగానూ ఆయన జాతీయవాదానికి అడ్డంకిగా ఉండదన్నారు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన జాతీయవాద దృక్ఫథం రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగించదన్నారు. చంద్రబాబులోని ప్రత్యేకత, గొప్పదనం అదేనన్నారు. ఒకవైపు దేశహితం, మరొకవైపు రాష్ట్ర ప్రగతి రెండింటినీ.. సమానంగా చూస్తూ పాలన సాగించడం చంద్రబాబు ప్రత్యేకత అన్నారు. ముసునూరు గ్రామాన్ని వ్యవసాయ రంగంలో ఒక విజయగాథగా తీర్చిదిద్దినందుకు ఆయనను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కొలుసు పార్థసారథి, కోర్టెవా పాప్‌కార్నికా ఎండి పట్టాభి రామారావు తదితరులు పాల్టొన్నారు.
Vice President Radhakrishnan praises Chandrababu Naidu, Eluru Musunuru Event, NonGMO Popcorn Seed, Andhra Pradesh Agriculture, TeluguOne


